టాలీవుడ్ కి భలే భలే బ్లాక్ బ్లాస్టర్
on Sep 12, 2015
.jpg)
నాని నటించిన ‘భలే భలే మగాడివోయ్’ సినిమా తొలి వారం బాక్సాఫీస్ వద్ద ఊహించని స్థాయిలో వసూళ్లు రాబట్టింది. మొదటి వారం రూ.24 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి టాలీవుడ్ ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యానికి గురి చేసింది. ఇందులో షేర్ రూ.14.2 కోట్లు. బడా హీరోల సినిమాలకు మాత్రమే ఈ స్థాయిలో వసూళ్లు వస్తాయి.
ఏరియాల వారీగా చూస్తే నైజాంలో రూ.6 కోట్ల గ్రాస్.. రూ.3.7 కోట్ల షేర్ వచ్చింది.సీడెడ్ లో రూ.96 లక్షలు వైజాగ్ లో రూ.91 లక్షలు తూర్పు గోదావరిలో రూ.55 లక్షలు పశ్చిమ గోదావరిలో రూ.45 లక్షలు కృష్ణాలో రూ.58 లక్షలు గుంటూరులో రూ.82 లక్షలు నెల్లూరులో రూ.18 లక్షలు షేర్ వసూలైంది. మొత్తంగా తెలంగాణ ఏపీ కలిపి రూ.13.25 కోట్ల గ్రాస్ రూ.8.15 కోట్ల షేర్ కలెక్టయింది.
స్టార్ హీరోలకు మాత్రమే వసూళ్లుండే కర్ణాటకలో కూడా భలే భలే మగాడివోయ్ ప్రభంజనం సాగింది. అక్కడ రూ.3.06 కోట్ల గ్రాస్ రూ.1.4 కోట్ల షేర్ వచ్చింది. ఇక అమెరికాలో ఈ సినిమా దాదాపుగా మిలియన్ మార్కును అందుకుంది. తొలి వారంలో రూ.6.39 కోట్ల గ్రాస్ రూ.4.15 కోట్ల షేర్ వచ్చింది. మొత్తానికి నాని టాలీవుడ్ కి భలే భలే బ్లాక్ బ్లాస్టర్ హిట్ ఇచ్చాడు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



