డిస్సప్పాయింట్ చేసిన అవికా!
on May 16, 2015
.jpg)
ఉయ్యాల జంపాలలో అవికాగోర్ ని చూసి టాలీవుడ్ ని ఓ ఊపు ఊపేస్తది అనుకున్నారు. కానీ అమ్మడు పెట్టే కండిషన్స్ కి బెంబేలెత్తిన దర్సకనిర్మాతలు అటువైపే చూడడం మానేశారు. పైగా అవికా ఏమైనా పెద్ద పిగరా ఏంటి? కనీసం స్టైల్ కూడా తెలీదంటున్నారట. ఈ మధ్య ఓ ఫంక్షన్ కు హాజరైన చిన్నారి పెళ్లికూతురు ఆడియన్స్ ను చాలా డిస్సప్పాయింట్ చేసేసిందట. రెండుపదులైనా నిండని అవిక కత్తిలాంటి లుక్స్ తో కేక పెట్టించాల్సి పోయి అప్పలమ్మలా తయారై వచ్చిందట. తీరుతెన్నూ లేని తారలే అందాలకు పదునుపెట్టి అదరహో అనిపిస్తున్నారు. అలాంటిది చూట్టానికి బాగానే ఉండే అవికకు డ్రస్, మేకప్ సెన్స్ లేనేలేదంటున్నారు. ఇప్పటికైనా కాస్త జాగ్రత్తలు తీసుకుంటే మంచిదనే ఉచిత సలహాలిస్తున్నారు. వినవమ్మా అవికా!
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



