స్వీటి సీక్రెట్ చెప్పేసిన అనుష్క
on Jul 4, 2014

నవ్వితే చాలు మనసులో తీపిదనం నిండిపోతుంది. అంతటి తియ్యటి నవ్వు కాబట్టే ఆమెకు స్వీటి అని పేరు పెట్టి వుంటారు వాళ్లింట్లో వాళ్లు. ఆ నవ్వు ఎవరిదో కాదు మన అందాల అనుష్కది. ఇంతకీ అనుష్కకు స్వీటికి సంబంధం ఏంటనేగా అనుకుంటున్నారు. అనుష్క అసలు పేరు, ముద్దు పేరు సినిమాల్లోకి రాక ముందు స్వీటియే. చిన్నప్పుడు ఇంట్లో పిలుచుకునే ముద్దుపేరే స్కూల్లోనూ కంటిన్యూ అయిపోయింది. సినిమాల్లోకి వచ్చాక సూపర్ సినిమా సమయంలో పేరు గురించి అడిగారట. అప్పుడు ఆలోచించి తన పేరు అనుష్క అని తానే పెట్టుకుని అందరికీ చెప్పిందట. కొత్తలో ఎవరు అనుష్క అని పిలిచినా తనను పిలుస్తున్నారని అర్థమయ్యేది కాదట. ఇప్పటికయినా స్వీటి అని పిలవగానే చటుక్కున పలుకుతుందట అనుష్క.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



