హీరోయిన్ అనుష్క ఆంటీనా ..
on Jul 8, 2014
.jpg)
పాపం అందమైన పడుచులను ఆంటీ అని పిలవకూడదని కొత్త రూలు ఏదైనా వస్తే బాగుండు, అని చాలా మంది ఆడవాళ్లు అనుకోవచ్చు.. ఎందుకంటే మామూలుగా ఆంటీ అంటే నిజంగా ఆంటీలకు కూడా చిర్రెత్తుతుంది. అదీ అందమైన అమ్మాయిలను అంటే కయ్యానికి వేరే కారణం అవసరం లేదు. అలాంటిది ఒక హీరోయిన్ ను పట్టుకుని ఆంటీ అంటే ఏంటి పరిస్థితి...
ఏంటో తెలుసుకోవాలంటే అనుష్కను అడగాల్సిందే.. ‘రుద్రమదేవి’ సెట్లో బిజీగా షూటింగ్ లో వున్న అనుష్క దగ్గరకు చాలా మంది పిల్లలు వచ్చి చేరారట. పిల్లలని చూసి అనుష్క కూడా తెగ సంబరపడి పోయిందట. అంతవరకూ అంతా మాములుగానే వుంది.. ఆ పిల్లలు అనుష్కను ఆంటీ అని సంబోధిస్తూ ఆటోగ్రాఫ్ ఇమ్మని అడిగారట. నవ్వుతూ వున్న అనుష్క కాస్త ఆ తర్వాత నుంచి చికాకుగా మారిందట. ఇది చూసి అక్కడున్న వారు అనుష్క ఆంటీ పిలుపు విని అలా చికాకుగా మొహం పెట్టి వుంటదని కొందరు, గుంపుగా అంత మంది వచ్చినందుకు విసుగు కలిగిందని మరి కొందరు అనుకున్నారట.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



