ENGLISH | TELUGU  
Home  » Gossips

AA22: అల్లు అర్జున్ సినిమాలో మరో టాలీవుడ్ స్టార్.. 2000 కోట్లు లోడింగ్! 

on Feb 17, 2026

 

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun), కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్ లో ఓ సైన్స్ ఫిక్షన్ ఫిల్మ్ రూపొందుతోంది. ఇది అల్లు అర్జున్ కి 22వ సినిమా (AA22).  సన్ పిక్చర్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ ఫిల్మ్ ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఈ చిత్రానికి సంబంధించి పెద్దగా అప్డేట్స్ లేవు, ఇంతవరకు ఫస్ట్ లుక్ కూడా విడుదల కాలేదు. అయినప్పటికీ అంచనాలు మాత్రం భారీస్థాయిలో ఉన్నాయి. ఇక ఇప్పుడు ఈ మూవీకి సంబంధించి ఓ క్రేజీ న్యూస్ వినిపిస్తోంది.

 

'AA22'లో రానా దగ్గుబాటి(Rana Daggubati) నటిస్తున్నాడట. కథకి కీలకమైన పాత్రలో కనిపించనున్నాడని తెలుస్తోంది. హీరో, విలన్, ప్రత్యేక పాత్ర అనే లెక్కలు వేసుకోకుండా.. అన్ని రకాల పాత్రలు చేయడానికి రెడీగా ఉంటాడు రానా. తన 15 ఏళ్ళ సినీ ప్రయాణాన్ని గమనిస్తే ఈ విషయం స్పష్టంగా తెలుస్తుంది. ఇక ఇప్పుడు 'AA22'లో కూడా ఒక పాత్ర చేయడానికి రానా ఓకే చెప్పాడన్న న్యూస్ వైరల్ గా మారింది. ఈ రోల్ తో రానా అందరినీ సర్ ప్రైజ్ చేయడం ఖాయమని చెబుతున్నారు.

 

 

'AA22'లో దీపికా పదుకొనే హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. అలాగే రష్మిక మందన్న, మృణాల్ ఠాకూర్, జాన్వీ కపూర్ నటిస్తున్నట్లు సమాచారం. ఇందులో రష్మికది నెగెటివ్ రోల్ అని టాక్.

 

ఈ చిత్రాన్ని 2027 వేసవిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. 'పుష్ప-2' తరువాత అల్లు అర్జున్, 'జవాన్' తరువాత అట్లీ చేస్తున్న సినిమా కావడంతో పాటు.. గ్లోబల్ మార్కెట్ ని టార్గెట్ చేస్తూ తెరకెక్కిస్తున్న సైన్స్ ఫిక్షన్ ఫిల్మ్ కావడంతో పాజిటివ్ టాక్ వస్తే రూ.2000 కోట్ల గ్రాస్ క్లబ్ లో చేరడం ఖాయమనే అంచనాలు ఉన్నాయి.

 

Also Read: నటి ప్రత్యూష మృతి కేసులో సుప్రీంకోర్టు తుది తీర్పు!

 

 

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.