తప్పు నాదే.. క్షమించడండి..!! కానీ...?
on Feb 7, 2018
.jpg)
సెల్ఫీ దిగాలని ముచ్చటపడిన ఓ చిన్నారిని నానా మాటలు అనడేమే కాకుండా.. ఆ బాబు చేతిలోని సెల్‌ఫోన్ లాక్కొని పగలగొట్టింది జబర్దస్త్ యాంకర్ అనసూయ. సెల్ఫీ దిగితే దిగాలి.. లేదంటే లేదని చెప్పాలి.. అంతే కానీ ఫోన్ పగలగొట్టడం ఏంటీ..? ఇద్దరు పిల్లలకు తల్లి అయ్యుండి.. చిన్న పిల్లాడితో ప్రవర్తించాల్సిన తీరు ఇదేనా అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు అనసూయపై మండిపడుతున్నారు. అటు తిరిగి.. ఇటు తిరిగి ఈ వ్యవహారం కాస్తా వివాదంగా మారుతుండటంతో అనసూయ స్పందించింది.
ఈ పరిణామం తనను ఆశ్చర్యానికి గురిచేసిందని.. నిజానిజాలు తెలుసుకోకుండా జనం తనను నిందించడం భావ్యం కాదని ఆమె ట్వీట్ చేసింది. మా అమ్మను చూడటానికి నేను తార్నాక వెళ్లా.. నేను పని ముగించుకుని బయటకు వస్తుండగా ఆమె తన కొడుకుతో కలిసి నన్ను వీడియో తీశారు.. నాతో సెల్ఫీకి ప్రయత్నించారు.. నేను అప్పుడు సెల్ఫీ దిగే పరిస్థితిలో లేను.. అందుకే తిరస్కరించా..? అయినప్పటికీ కెమెరా ముఖం దగ్గరకి పెట్టే సరికి.. కంగారుపడి.. నా ముఖం కప్పుకున్నా.. ఇక్కడి నుంచి వెళ్లండి అని వారికి చెప్పి కారులో కూర్చొన్నా..? ఆ కంగారులో ఫోన్ పగిలిందా..? లేదా.? అన్న విషయం నాకు గుర్తులేదు.. నా వల్లే ఫోన్ పగిలితే మాత్రం క్షమాపణలు కోరుతున్నా..? కానీ నా ప్రైవసీ నాకు ఉంటుంది కదా.? అంటూ చెప్పుకొచ్చింది జబర్దస్త్ యాంకర్.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



