అంధుడి పాత్రలో అల్లు అర్జున్!!
on Jun 21, 2021
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'పుష్ప' మూవీలో నటిస్తున్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ మూవీ రెండు భాగాలుగా విడుదల కానుంది. పుష్ప మొదటి భాగం పూర్తయిన తర్వాత బన్నీ.. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో రూపొందనున్న 'ఐకాన్' మూవీలో నటించనున్నాడు. అయితే ఇప్పుడు ఈ మూవీలో బన్నీ పాత్రకి సంబంధించిన ఒక న్యూస్ చక్కర్లు కొడుతోంది.
ఐకాన్ మూవీలో బన్నీ అంధుడు పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. అయితే మూవీ మొత్తం అంధుడిగా కనిపిస్తాడా?.. డ్యూయల్ రోల్ పోషిస్తూ ఒక పాత్రలో అంధుడిగా కనిపిస్తాడా? అనేది తెలియాల్సి ఉంది. బన్నీ అంధుడు పాత్రలో నటించనున్నట్లు వినిపిస్తోన్న వార్త నిజమైతే మాత్రం.. పుష్ప వంటి భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ తర్వాత బన్నీ ఇటువంటి పాత్ర పోషించడం నిజంగా సాహసమనే చెప్పాలి.
కాగా, గతంలో మాస్ మహరాజా రవితేజ 'రాజా ది గ్రేట్' మూవీలో అంధుడి పాత్ర పోషించి ఘన విజయాన్ని అందుకున్నాడు. మరి ఇప్పుడు బన్నీ అంధుడి పాత్రతో ఎలాంటి సంచలనం సృష్టిస్తాడో చూడాలి.