ఆ హీరోయిన్‌ని బెడ్ రూమ్‌కి రమ్మన్నది ఎవరు?
on Mar 13, 2017

కస్తూరి తెలుసుకదా?? తెలుగు నైన్‌టీస్‌లో వచ్చిన తెలుగు సినిమాల్లో తరచూ కనిపించిన కథానాయిక. గ్లామర్ కంటే హోమ్లీ పాత్రలకే పెద్దపీట వేసింది. ఇప్పుడు కన్నడలో కొన్ని సినిమాలు చేస్తోంది. ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో కస్తూరి ఓ తెలుగు హీరోని టార్గెట్ చేస్తూ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసింది.
సదరు హీరోతో తాను గతంలో ఓ సినిమా చేశానని, అతను తనని వాడుకోవాలని చూశాడని, బెడ్ రూమ్‌కి రమ్మని సంకేతాలు పంపాడని, కానీ.. తాను పట్టించుకోలేదని, ఆ అసహనాన్ని తను చాలా సార్లు ప్రదర్శించాడని, సెట్లో కోప్పడేవాడని... ఇలా సంచలన వ్యాఖ్యలు చేసింది. ఆ హీరో ఆ తరవాత రాజకీయాల్లోకి వచ్చాడని, ఆ రోజు తాను కోపరేట్ చేయనందువల్లే.. తదుపరి సినిమాల్లో నటించే ఛాన్స్ లేకుండా చేశాడని చెప్పుకొచ్చింది. దాంతో ఆ హీరో ఎవరంటూ... టాలీవుడ్‌లో ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. కస్తూరితో ఒకే ఒక్క సినిమా చేసి, ఆ తరవాత రాజకీయాల్లోకి షిప్ట్ అయిపోయిన హీరోల లిస్టు తీస్తున్నారు సినీ అభిమానులు. మరి కస్తూరిని ఏడిపించిన ఆ హీరో ఎవరో మీకేమైనా తెలిసిందా??
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



