విశాల్ ప్రత్యర్థితో వరలక్ష్మీ డేటింగ్..?
on Nov 25, 2016

తండ్రితో గొడవ పెట్టుకుంటూ..అతని కూతురితో ప్రేమాయణం నడపటం బహుశా మనం సినిమాల్లోనే చూశాంటాం. కానీ అది రియల్ లైఫ్‌లో జరిగితే..సినిమాల్లో నటించే వారికే అలాంటి సంఘటన ఎదురైతే అచ్చంగా విశాల్-వరలక్ష్మీ లవ్‌స్టోరీ అని క్లియర్ కట్‌గా చెప్పవచ్చు. నడిగర్ సంఘం ఎన్నికల్లో విశాల్, వరలక్ష్మీ తండ్రి శరత్‌కుమార్‌లు నువ్వానేనా అన్నట్లు పోటీపడ్డారు. ఎన్నికల ప్రచారంలో ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకున్నారు. అయితే ఎన్నికల్లో అదృష్టం విశాల్‌నే వరించింది.
అప్పటి నుంచి విశాల్, శరత్‌కుమార్‌లు బద్ధశత్రువుల్లా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో శరత్ కుమార్తె వరలక్ష్మీతో విశాల్ ప్రేమాయణం తమిళ సినీ వర్గాలను ఆశ్చర్యంలో ముంచెత్తింది. సుధీర్ఘకాలం సాగిన వీరి ప్రేమ ఇటీవల పెటాకులైంది. విశాల్ తనను పట్టించుకోవడం లేదంటూ వరలక్ష్మీ ఇన్‌డైరెక్ట్‌గా ప్రకటించి సంచలనం సృష్టించింది.
ఈ సంగతి పక్కనబెడివతే ఈ బ్యూటీ తమిళ రోమాంటిక్ స్టార్ శింబుకు దగ్గరైనట్లు కోలీవుడ్ వర్గాలు చెప్పుకుంటున్నాయి. నడిగర్ సంఘం ఎన్నికల్లో శింబు విశాల్‌కు కాకుండా శరత్ కుమార్‌కు మద్ధతిచ్చాడు. దీంతో శింబుకు విశాల్‌కు మధ్య కోల్డ్ వార్ నడిచింది. తన నుంచి దూరమైన వరం ఇప్పుడు తన శత్రువుకు దగ్గరవ్వడం విశాల్ జీర్ణించుకోలేకపోతున్నాడట. దీనిలో నిజానిజాలు తెలియాలంటే కొంతకాలం వెయిట్ చేయకతప్పదు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



