ఎన్టీఆర్ కి కృష్ణ వ్యతిరేకంగా మారడానికి కారణం ఇదే
on Nov 15, 2023
నందమూరి తారకరామరావు, ఘట్టమనేని కృష్ణ ఈ ఇద్దరు అప్పటివరకు ఉన్న తెలుగు చిత్ర సీమ పోకడల్ని సమూలంగా మార్చి వేసి సూపర్ స్టార్ లుగా ఎదిగిన గొప్ప నటులు. ఇద్దరికీ కొన్ని లక్షల మంది అభిమానులు ఉన్నారు. కృష్ణ గారికి ఎన్టీఆర్ అన్నా ఎన్టీఆర్ కి కృష్ణ గారు అన్నా చాలా అభిమానం. ఎన్టీఆర్ కి కృష్ణ వీరాభిమాని అవ్వడంతో పాటు దేవుడుగా కూడా ఎన్టీఆర్ ని కృష్ణ కొలుస్తాడు. మరి అలాంటి ఇద్దరి మధ్య ఎందుకు గొడవలు వచ్చాయి. పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఆ ఇద్దరి మధ్య ఎందుకొచ్చింది?
నందమూరి తారక రామారావు.. ఈ పేరు వింటే పులకరించిపోని తెలుగు వారు ఉండరు. సాంఘిక, పౌరాణిక ,జానపద చిత్రాల్లో తనదయిన శైలి లో నటించి తెలుగు సిల్వర్ స్క్రీన్ ముందు కాసుల వర్షాన్ని కురిపించిన గొప్ప నటుడు. రాముడు గా నటించి తన రూపాన్నే జనం రాముడుగా కొలిచేలా చేసుకున్న గొప్ప పుణ్యమూర్తి. అలాగే సినిమా రంగంలో ఎంతో మంది కొత్త వాళ్ళని కూడా ప్రోత్సహించిన గొప్ప వ్యక్తి . విశ్వ విఖ్యాత నట సార్వభౌమ కైకాల సత్యనారాయణ తన కెరీర్ మొదట్లో హీరో గా ఫెయిల్ అయ్యి సినిమాలు వదిలేసి ఇంటికి వెళ్లబోతుంటే ఎన్టీఆర్ సత్యనారాయణ గారిని పిలిచి సినిమా అంటే కేవలం హీరోనే కాదని ఇంకా ఎన్నో పాత్రలు ఉన్నాయని చెప్పి సత్యనారాయణ గారు తెలుగు సినీ పరిశ్రమలో మహా నటుడు గా ఎదగడానికి ఎన్టీఆర్ నే కారణం. ఇలా ఎంతో మందిని తెలుగు సినిమా ఇండస్ట్రీ లో నిలబెట్టిన ఘనత ఎన్టీఆర్ సొంతం. అలాగే ఎన్టీఆర్ రాజకీయాల్లో సృష్టించిన సంచలనం నడుస్తున్న యుగానికి ప్రత్యక్ష సాక్ష్యం.
కృష్ణ ..తెలుగు చిత్ర పరిశ్రమలోనే కాకుండా సౌత్ చిత్ర పరిశ్రమలోనే మొట్టమొదటి సూపర్ స్టార్ గా అవతరించిన నటుడు. లవర్ బాయ్ గా, జేమ్స్ బాండ్ గా,మధ్యతరగతి యువకుడిగా,విప్లవ యోధుడిగా ఉద్యమకారుడిగా, గూఢచారిగా,రాజుగా ఇలా ఎన్నో పాత్రల్లో నటించి కృష్ణ సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. తెలుగు సినిమాకి నూతన సొగసులుని, టెక్నాలజీ ని అద్ది తెలుగు సినిమాని వేగంతో పరుగెత్తేలా చేసి తెలుగు సినిమా కి ఎంతగానో సేవ చేసారు.ఎంతో మంది నిర్మాతలని కూడా ఆదుకొని వాళ్ళకి ఫ్రీ గా సినిమాలు కూడా చేసి కృష్ణ రీల్ హీరో నే కాదు రియల్ హీరో కూడా అని అనిపించుకున్నారు.
మరి ఇంత మంచివాళ్లు అయిన ఎన్టీఆర్ కృష్ణల మధ్య గొడవలు ఎందుకొచ్చాయని అనుకుంటున్నారా.. తెలుగు దేశం పార్టీ ని స్థాపించిన ఎన్టీఆర్ ఆంధ్రప్రదేశ్ లో జరిగిన ఎన్నికల్లో అధ్భుతమైన మెజారిటీ ని ముఖ్య మంత్రి పీఠాన్ని అధిరోహించారు. ఆ తర్వాత జరిగిన కొన్ని పరిణామాలవల్ల నాదెండ్ల భాస్కరరావు ఎన్టీఆర్ అనుమతి లేకుండా ముఖ్యమంత్రి అయ్యాడు .ఆ టైంలో పద్మాలయ స్టూడియో నుంచి నాదెండ్ల భాస్కర్ రావు ని సమర్థిస్తూ ఒక ప్రెస్ నోట్ రిలీజ్ అయ్యింది. దాంతో ఎన్టీఆర్ అభిమానులు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కృష్ణ గారికి వ్యతిరేకంగా ఆందోళనలు చేపట్టి కృష్ణ గారి ఫోటోలు ,సినిమా వాల్ పోస్టర్స్ ని తగలపెట్టారు. చాలా చోట్ల కృష్ణ గారి ఫ్యాన్స్ కి ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి మధ్య గొడవలు కూడా జరిగాయి. ఈ విషయం షూటింగ్ లో ఉన్న కృష్ణ గారికి తెలిసింది.
దాంతో మొదట నుంచి పట్టుదలకి మారుపేరైన కృష్ణ ఎక్కడ తగ్గకూడదని నిర్ణయించుకొని ఎన్టీఆర్ ని వ్యతరేకిస్తు కాంగ్రెస్ పార్టీ లో చేరారు. ఆ తర్వాత కృష్ణ గారు కాంగ్రెస్ కి మద్దతుగా కొన్ని సినిమాల్లో నటించడమే కాకుండా కొన్ని సినిమాలని కూడా నిర్మించారు. ఏలూరు నుంచి కాంగ్రెస్ ఎంపీ గా కూడా పోటీ చేసి గెలిచారు.కానీ ఎన్టీఆర్ ,కృష్ణ లకి కూడా తెలియని విషయం ఏంటంటే ఇద్దరి మంచి వాళ్ళ మధ్య అపార్ధాలు కలకాలం నిలబడలేవు. కొన్ని సంవత్సరాల తర్వాత ఎన్టీఆర్, కృష్ణ లు విబేధాలన్నీ మర్చిపోయి కలిసిపోయారు.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
