చిరంజీవిని నిజంగానే చెంపమీద గట్టిగా కొట్టేసిన రాధిక!
on Jun 19, 2021

చిరంజీవితో రాధిక నటించిన తొలి చిత్రం 'ప్రియ' అయినా, విడుదలైన తొలి చిత్రం మాత్రం 'న్యాయం కావాలి' (1981). క్రాంతికుమార్ నిర్మించగా, ఎ. కోదండరామిరెడ్డి డైరెక్ట్ చేసిన ఈ సినిమా మంచి హిట్టయింది. ఆ తర్వాత నుంచీ చిరంజీవి, రాధిక మంచి స్నేహితులయ్యారు. వాళ్ల కాంబినేషన్‌లో వరుసగా సినిమాలొచ్చాయి. పెళ్లయ్యాక చిరంజీవి మద్రాస్ టి. నగర్‌లో హబీబుల్లా రోడ్డు దగ్గర ఉండేవారు. ఆయన ఇల్లు, రాధిక ఇల్లు పక్కపక్కనే. దాంతో రాధిక తరచూ చిరంజీవి ఇంటికి వెళ్లేవారు. అలా వాళ్ల ఫ్యామిలీ ఫ్రెండ్ అయిపోయారామె.
'న్యాయం కావాలి' సినిమాలో చిరంజీవి, రాధికకు గమ్మత్తైన అనుభవాలున్నాయి. ఆ సినిమాలో చిరంజీవి యాంటీ హీరోగా నటించారు. రాధికను ప్రేమించానని చెప్పి, శారీరకంగా అనుభవించి, ఆ తర్వాత మోసం చేసే పాత్ర ఆయనది. ఒక సందర్భంలో నన్నెందుకు మోసం చేశావని అడుగుతూ, ఆమె చిరంజీవి చెంపమీద కొట్టి భావోద్వేగభరితంగా సుదీర్ఘమైన డైలాగులు చెప్పాలి. ఆ సీన్ కోసం తనను చెంపమీద నిజంగానే కొట్టాల్సిందిగా చిరంజీవి చెప్పారు. ఆ షాట్ సరిగా రాకపోవడంతో పదే పదే రిటేకులు చేయాల్సి వచ్చింది. ఒక టేక్‌లో సన్నివేశంలో లీనమైపోయిన రాధిక ఆయనను గట్టిగా కొట్టేశారు. షాట్ ఓకే అయ్యింది. చూస్తే.. చిరంజీవి చెంప ఎర్రగా కందిపోయింది.
చిరంజీవితో ఎక్కువ సినిమాల్లో హీరోయిన్‌గా నటించింది రాధికే. ఆ ఇద్దరూ కలిసి నటించిన చివరి చిత్రం 'రాజా విక్రమార్క' (1990). ఇక వాళ్ల కలయికలో వచ్చిన సినిమాల్లో అభిమానులకు అత్యంత ఇష్టమైన చిత్రం 'అభిలాష'.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



