నయనది ఏం లెగ్ రా నాయనా.. అడుగు పెడితే అంతే!
on Sep 8, 2023

దక్షిణాదిన లేడీ సూపర్ స్టార్ అనిపించుకున్నారు కేరళ కుట్టి నయనతార. 20 ఏళ్ళ కెరీర్ లో మలయాళ, తమిళ, తెలుగు, కన్నడ.. ఇలా అన్ని దక్షిణాది భాషల్లోనూ నటించి కథానాయికగా తనదైన ముద్ర వేశారు ఈ స్టార్ బ్యూటీ. ఇక తాజాగా 'జవాన్'తో బాలీవుడ్ లోకి అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ.. ఫస్ట్ హిందీ ఫిల్మ్ తోనే అక్కడి ప్రేక్షకులను ఇంప్రెస్ చేసింది. అలాగే, తన ఖాతాలో మరో మెమరబుల్ హిట్ ని క్రెడిట్ చేసుకుంది.
ఇదిలా ఉంటే, నయనతారకి ఓ సెంటిమెంట్ ఉంది. అదేమిటంటే.. తను ఏ భాషలో తొలిసారిగా నటించినా.. ఆ సినిమా హిట్ అవుతుంది. వివరాల్లోకి వెళితే.. 2003లో నయన్ నటించిన తొలి మలయాళ చిత్రం 'మనస్సినక్కరే' అఖండ విజయం సాధించింది. అలాగే 2005లో 'అయ్య'తో కోలీవుడ్ ఎంట్రీ ఇస్తే.. సదరు సినిమా బ్లాక్ బస్టర్ బాట పట్టింది. ఇక 2006లో 'లక్ష్మి'తో తెలుగులో తొలి అడుగేస్తే.. స్క్రీన్స్ అన్నీ షేక్ అయ్యాయి. అలాగే 2010లో 'సూపర్'తో కన్నడ సీమలో అడుగు పెడితే.. అది కూడా ఓ సెన్సేషనే. కట్ చేస్తే.. 2023లో అంటే ఈ ఏడాది 'జవాన్'తో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తే.. విడుదలైన ప్రతీ చోట ఈ బొమ్మ బాక్సాఫీస్ ని దున్నేస్తోంది. మొత్తమ్మీద.. నయన్ బోణి ఎక్కడ జరిగినా బాక్స్ బద్ధలవ్వాల్సిందే అన్నమాట. ఈ ట్రాక్ ని గమనించిన వారంతా.. "నయనది ఏం లెగ్ రా నాయనా.. అడుగు పెడితే బొమ్మ బ్లాక్ బస్టరే" అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



