బర్త్ డే మంత్ లో అట్లీ హిట్స్.. ఏంటో తెలుసా?
on Sep 21, 2023
ఇటు కోలీవుడ్ లోనూ, అటు బాలీవుడ్ లోనూ దర్శకుడిగా తనదైన ముద్ర వేశాడు అట్లీ. సరిగ్గా పదేళ్ళ క్రితం కెప్టెన్ గా తొలి అడుగేసిన అట్లీ.. ఈ ప్రయాణంలో ఇప్పటివరకు ఐదు సినిమాలు చేశాడు. వాటిలో నాలుగు తమిళ చిత్రాలుండగా.. ఒక హిందీ ఫిల్మ్ ఉంది. ఇవన్నీ కూడా బాక్సాఫీస్ ముంగిట వసూళ్ళ వర్షం కురిపించాయి.
ఇదిలా ఉంటే, సెప్టెంబర్ 21 అట్లీ పుట్టినరోజు. విశేషమేమిటంటే.. అట్లీ తొలి చిత్రమైన 'రాజా రాణి' 2013 సెప్టెంబర్ నెలలోనే జనం ముందు నిలిచింది. ఆర్య, నయనతార, నజ్రియా ముఖ్య పాత్రల్లో నటించిన ఈ మూవీ సెప్టెంబర్ 27న థియేటర్స్ లోకి వచ్చింది. కట్ చేస్తే.. మళ్ళీ పదేళ్ళ అనంతరం అదే సెప్టెంబర్ నెలలో అట్లీ మొదటి హిందీ సినిమా 'జవాన్' రిలీజైంది. 2023 సెప్టెంబర్ 7న ఈ సినిమా తెరపైకి వచ్చింది. ఇందులో షారుక్ ఖాన్, నయనతార, దీపికా పదుకొణె ముఖ్య పాత్రల్లో సందడి చేశారు. మొత్తమ్మీద.. బర్త్ డే మంత్ లో అట్లీకి 'రాజా రాణి', 'జవాన్' వంటి మెమరబుల్ హిట్స్ ఉన్నాయన్నమాట. విశేషమేమిటంటే.. ఈ రెండు సినిమాల్లోనూ నయన్ నే హీరోయిన్. మరి.. మున్ముందు కూడా బర్త్ డే మంత్ లో అట్లీ ఘనవిజయాలు అందుకుంటాడేమో చూడాలి.
(సెప్టెంబర్ 21.. అట్లీ బర్త్ డే సందర్భంగా)

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
