దాసరి నారాయణరావుకి తన గత జన్మ గురించి తెలుసు!
on Nov 24, 2023
.webp)
దాసరి నారాయణరావు..తెలుగు సినిమా రంగంలో ఈ పేరు ఒక సంచలనం. రైటర్ గా తన సినీ కెరీర్ ని ప్రారంభించి దర్శకుడుగా,నటుడుగా,పాటల రచయితగా,నిర్మాతగా ,డిస్ట్రిబ్యూటర్ గా ,సినీ ఫెడరేషన్ అధ్యక్షుడుగా ,పత్రికాధిపతిగా,రాజకీయనేతగా ఇలా అన్నింటిలోను విజృంభించి తనకెవరూ పోటీ కాదని నిరూపించిన గొప్ప దీక్షాపరుడు . మరి అంతటి బహుముఖ ప్రజ్ఞాశాలిగా ఆయన రాణించడానికి కారణం ఏంటి? అసలు అంతటి అపారమైన తెలివితేటలు ఆయనకీ ఎక్కడ నుంచి వచ్చాయి. ఆయన గత జన్మ వల్లే దాసరి కి అన్ని తెలివితేటలు వచ్చాయా? పైగా దాసరికి తన గత జన్మ గురించి ముందుగానే తెలుసా ?
కళ అనేది చాలా గొప్పది. కథ ని పుట్టించి ఆ కథకి ఒక రూపాన్ని తీసుకురావాలంటే రచయిత కావాలి. ఆ తర్వాత ఆ కథకి సరికొత్త హంగులని చేర్చి తెర మీద అందంగా చూపించడానికి ఒక దర్శకుడు కావాలి. కథలోని పాత్రలని అర్ధం చేసుకొని వాళ్ళ సంతోషాన్ని,ఆలోచనని ,బాధని పాట రూపంలో వ్యక్తం చెయ్యడానికి ఒక పాటల రచయిత కావాలి. ఈ మూడింటిలోను ఎవరు రాణించలేరు. ఎందుకంటే కొన్ని లక్షల మందిని మెప్పించే కళ విషయంలో ఎవరికీ అంత జ్ఞాపక శక్తి ఉండదు. కానీ దాసరి ఆ మూడింటిలోను అధ్భుతమైన ప్రదర్శన కనపరిచారు. ఆయన అంతలా ప్రతిభ కనపర్చడానికి కారణం ఆయన గత జన్మ. ఆయన గత జన్మ వల్లే దాసరికి అంతటి అపారమైన తెలివితేటలు వచ్చాయి.
దాసరి గత జన్మలో కేరళలోని నంబూద్రి గా పిలవబడే ఒక మహా పండితుల వంశంలో జన్మించారు. ఈ నంబూద్రి వంశం వారు కళకి సంబంధించిన అన్ని విషయాల్లోను ఆరితేరిన వారు. మిగతా వారి కంటే చాలా ఎక్కువగా తెలివితేటల్ని కలిగి మహా స్ఫురద్రుష్టితో ఉంటారు. అలాగే ఎవరికైనా వీరిని చూస్తే చాలు అమాంతం కాళ్ళ మీద పడి నమస్కారం చెయ్యాలనే విధంగా ఉంటారు. ఈ నంబూద్రి వంశంలోనే దాసరి తన గత జన్మలో జన్మించాడు. అందుకే ఆయనకి ఈ జన్మలో అన్ని తెలివి తేటలు వచ్చాయి. ఈ గత జన్మ విషయాన్ని దాసరితో స్వయంగా ఒక కోయదొర చెప్పాడు. విచిత్రం ఏంటంటే దాసరి సినీ కెరీర్ స్టార్టింగ్ లోనే కోయదొర దాసరికి గత జన్మ విషయం చెప్పాడు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



