షూటింగ్‌లో టైగర్ ష్రాఫ్ కంటికి గాయం!
on Dec 22, 2021

బాలీవుడ్ స్టార్ హీరో టైగర్ ష్రాఫ్ కంటికి గాయమైంది. యూకేలో తన లేటెస్ట్ ఫిల్మ్ గణపత్ షూటింగ్‌లో పాల్గొంటుండగా కంటికి దెబ్బ తగిలినట్లు అతను వెల్లడించాడు. కంటికి గాయమైన సెల్ఫీ ఫొటోను తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో షేర్ చేశాడు టైగర్. షూటింగ్ సెట్ నుంచి ఆ ఫొటో దిగినట్లు తెలుస్తోంది. గ్రీన్ టి-షర్ట్ పైన బ్లాక్ జాకెట్ ధరించి వున్నాడు టైగర్. “Sh** happens #ganapath final countdown,” అని ఆ ఫొటోకు క్యాప్షన్ పెట్టాడు.
కొద్ది రోజులుగా 'గణపత్' షూటింగ్ యూకేలో జరుగుతోంది. టైగర్‌తో పాటు హీరోయిన్ కృతి సనన్ కూడా ఈ షూటింగ్‌లో పాల్గొంటోంది. టైగర్ ఫస్ట్ ఫిల్మ్ 'హీరోపంతి'లో జంటగా నటించాక, ఆ ఇద్దరూ మళ్లీ కలిసి నటిస్తోన్న సినిమా ఇదే. వికాస్ బెహల్ డైరెక్ట్ చేస్తోన్న ఈ మూవీని అతనితో పాటు వషు భగ్నాని, దీప్‌శిఖ దేశ్‌ముఖ్, జాకీ భగ్నాని కలిసి నిర్మిస్తున్నారు. 2022 డిసెంబర్ 23న ఈ మూవీ థియేటర్లలో విడుదల కానున్నది.
ఎలాంటి రిస్కీ షాట్‌నైనా డూప్ లేకుండా చేసే హీరోల్లో టైగర్ ష్రాఫ్ ఒకడు. ఎయిట్ ప్యాక్ బాడీతో సూపర్ ఫిట్‌గా ఉండే టైగర్ 'గణపత్'లో ఓ రిస్కీ షాట్ చేస్తుండగా కంటి దగ్గర గాయమైనట్లు యూనిట్ మెంబర్స్ తెలిపారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



