పఠాన్ సక్సెస్‌తో ఫేమస్ అయిన సిద్ధార్థ్
on Apr 28, 2023
నాలుగేళ్లకు పైగా వెయిట్ చేసిన సక్సెస్ షారుఖ్‌కి పఠాన్ రూపంలో దక్కింది. 2023జనవరి 25న విడుదలైన ఈ సినిమాకు అంత తేలిగ్గా మర్చిపోలేరు షారుఖ్ ఖాన్. దీపిక పదుకోన్ నాయికగా నటించిన సినిమా ఇది. యష్‌రాజ్ ఫిల్మ్స్ నిర్మించింది. జాన్ అబ్రహామ్ నెగటివ్ రోల్ చేశారు. నీతు కపూర్ రోల్‌కి చాలా మంచి స్పందన వచ్చింది. పోస్ట్ ప్యాండమిక్ అమితంగా డబ్బులు చేసిన సినిమాల్లో పఠాన్ కూడా ఒకటి. రిలీజ్‌కి ముందే రకరకాల వివాదాలలో చిక్కుకున్న పఠాన్, విడుదలయ్యాక మాత్రం సర్వత్రా పాజిటివ్ రివ్యూస్‌తో కలెక్షన్లు కొల్లగొట్టింది. పఠాన్ తర్వాత షారుఖ్‌కి, దీపిక పదుకోన్‌కి ఎంత హై వచ్చిందో ఏమోగానీ, డైరక్టర్ సిద్ధార్థ్ ఆనంద్‌కి మాత్రం మరో రేంజ్ ఎలివేషన్ వచ్చింది.
``పఠాన్ సినిమా ఇండస్ట్రీ గేమ్ చేంజర్ అయినందుకు ఆనందంగా ఉంది. జనాలు మమ్మల్ని బాయ్‌కాట్ చేస్తామని అన్నారు. కానీ పఠాన్ చూశాక అందరూ మా పనితీరును మెచ్చుకున్నారు.నెగటివిటీ అంతా పాజిటివ్గా మారింది. మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. మన పని మాట్లాడుతుందనే మాటకు ఇప్పుడు నా దృష్టిలో విలువ పెరిగింది`` అని అన్నారు సిద్ధార్థ్ ఆనంద్. సిద్ధార్థ్ ఇప్పుడు చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇండియాలో టాప్5 వెయ్యి కోట్ల సినిమాలను అందించిన దర్శకుల జాబితాలో హ్యాపీ స్పేస్‌ని ఎంజాయ్ చేస్తున్నారు. ప్రస్తుతం హృతిక్ రోషన్‌తో ఫైటర్ సినిమాను రూపొందిస్తున్నారు సిద్ధార్థ్. ఈ చిత్రంలోనూ దీపిక నాయికగా నటిస్తున్నారు. ఫైటర్ మూవీ ఇంకో రేంజ్‌లో ఉంటుందని ప్రేక్షకుల్లో జోష్ నింపారు షారుఖ్. తనకు ఇష్టమైన దర్శకుడు సిద్ధార్థ్ అంటూ సిద్ధార్థ్‌ని ప్రశంసల్లో ముంచెత్తారు. షారుఖ్, సల్మాన్ మధ్య పఠాన్ లో వచ్చే సన్నివేశాలను తెరకెక్కించినందుకు స్పెషల్ అప్లాజ్ అందుకుంటున్నారు సిద్ధార్థ్.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
