‘నేను బ్రతికే ఉన్నాను’.. పోలీసులను ఆశ్రయించిన నటుడు!
on Aug 23, 2025
ఇటీవలికాలంలో చాలా మంది సినీ ప్రముఖులు సోషల్ మీడియా వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు కల్పించి రాయడంలో సోషల్ మీడియా ఎప్పుడూ ముందుంటోంది. కేవలం వ్యూస్ కోసం కొత్త వార్తలు సృష్టించి మరీ వైరల్ చేస్తున్నారు. అలాంటి ఓ వార్త బాలీవుడ్ నటుడు రజా మురాద్‌ను మానసిక వేదనకు గురి చేసింది. రజా మురాద్ చనిపోయాడనే వార్త ఎంతో స్పీడ్‌గా వైరల్ అయిపోయింది. విషయం తెలుసుకున్న స్నేహితులు, బంధువులు, అభిమానులు ఫోన్లు, మెసేజ్ చేశారు. దీంతో విపరీతంగా ఆందోళనకు గురయ్యారు మురాద్.
ఈ విషయంపై రజా మురాద్ పోలీసులను ఆశ్రయించారు. వైరల్ అవుతున్న న్యూస్ గురించి పోలీసులకు వివరించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఇలాంటి వార్తలను ప్రచారం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హామీ ఇచ్చారు. సోషల్ మీడియా బాగా పెరిగిన తర్వాత ఏ వార్త నిజమైందో, ఏది అబద్ధమో చెప్పడం కష్టంగా మారిపోయింది. ముఖ్యంగా సినీ నటుల విషయంలో ఇది ఎక్కువైపోయింది. బ్రతికి ఉన్నవారినే చనిపోయారంటూ వారి ఫోటోలను పెట్టి దండ వేసి మరీ చెబుతున్నారు. ఇటీవల మరణించిన కోట శ్రీనివాసరావు ఇలాంటి ఇబ్బందిని అనేకసార్లు ఎదుర్కొన్నారు. అలాగే కమెడియన్ మల్లిఖార్జునరావు ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్న సమయంలో ఆయన చనిపోయారంటూ మీడియాలో వార్త వచ్చేసింది. ఇప్పుడు రజా మురాద్ విషయంలో కూడా అదే జరిగింది. తను బ్రతికే ఉన్నట్టు ప్రపంచానికి చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిరది.
1972లో నటుడుగా పరిచయమైన రజా మురాద్.. 53 సంవత్సరాలుగా సినిమాలు చేస్తూనే ఉన్నారు. ముఖ్యంగా విలన్‌గా అనేక సినిమాల్లో అద్భుతమైన పాత్రలు పోషించారు. తెలుగులో రుద్రనేత్ర, ఇంద్ర, జానీ, సుభాష్ చంద్రబోస్, బిజినెస్‌మేన్ వంటి తెలుగు సినిమాల్లో కూడా నటించారు మురాద్. ఇప్పటికీ అడపా దడపా సినిమాల్లో కనిపిస్తున్న రజా మురాద్.. పలు భాషల్లో 250కి పైగా సినిమాల్లో నటించారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



