కేమియో రోల్‌లో రణ్‌బీర్... షారుఖ్ కోసమేనా?
on Jun 6, 2023
షారుఖ్ ఖాన్‌తో ఆలియాకు చాలా మంచి ఫ్రెండ్‌షిప్ ఉంటుంది. వారిద్దరూ కలిసి సినిమా నిర్మించిన విషయం కూడా తెలిసిందే. ఆ ఫ్రెండ్ షిప్ ఇప్పుడు ఇంటిదాకా చేరుకుంది. షారుఖ్ కొడుకు ఆర్యన్ కోసం ఆలియా భర్త రంగంలోకి దిగారు. అది కూడా ఏ పెద్ద పనో అంటే సరేలే అనుకోవచ్చు. జస్ట్ కేమియో రోల్ చేయడానికి కూడా ఒప్పుకున్నారంటే, వారి మధ్య బాండింగ్ ఏ రేంజ్‌లో ఉందో అర్థం చేసుకోవచ్చు. షారుఖ్ ఖాన్, గౌరీ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ అతనికి యాక్టింగ్ మీద పెద్దగా ఆసక్తి లేదు. రైటింగ్ మీద, డైరక్షన్ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు. ప్రస్తుతం డైరక్టర్‌గా వెబ్‌సీరీస్‌తో నాంది పలుకుతున్నారు. రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై షారుఖ్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ వెబ్‌సీరీస్‌కి స్టార్‌డమ్ అని టైటిల్‌ని ఫిక్స్ చేసినట్టు సమాచారం. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కుతోంది.
ఇందులో రణ్‌బీర్ కపూర్ కేమియో అప్పియరెన్స్ ఇచ్చారన్నది లేటెస్ట్ టాక్. లాస్ట్ వీకెండ్‌లోనే రణ్‌బీర్ తన పార్ట్ షూట్ కంప్లీట్ చేశారట. సందీప్ రెడ్డి వంగాతో యానిమల్‌లో నటిస్తున్నారు రణ్‌బీర్. అదే లుక్‌లోనే ఆర్యన్ సీరీస్‌లోనూ కనిపిస్తారని టాక్. ఆర్యన్ తండ్రి, బాలీవుడ్ బాద్షా షారుఖ్‌ఖాన్ కూడా ఈ షూటింగ్ జరిగేటప్పుడు సెట్స్ కి వెళ్లారట. తన కుమారుడిని, రణ్‌బీర్‌ని కలిసి కాసేపు మాట్లాడి వెళ్లారట. కరణ్ జోహార్ కూడా స్టార్‌డమ్‌లో స్పెషల్ రోల్ చేస్తున్నారు. సీరీస్ మొదలుపెట్టినప్పుడు తొలి మూడు రోజులు కరణ్ మీదే చిత్రీకరించారు. రణ్‌వీర్ సింగ్, షారుఖ్ కూడా ఈ సీరీస్‌లో కేమియో అప్పియరెన్స్ లు చేస్తున్నారనే టాక్ కూడా ఉంది. స్టార్‌డమ్‌లో మొత్తం ఆరు ఎపిసోడ్స్ ఉంటాయి. యూనివర్శల్ టైటిల్ కాబట్టి స్టార్‌డమ్ అనే పేరు పెట్టాలనుకున్నారు. ఫిల్మ్ ఇండస్ట్రీ బ్యాక్ డ్రాప్‌లో జరిగే కథకి ఇంతకన్నా మంచి టైటిల్ దొరకదని షారుఖ్ సజెస్ట్ చేశారట.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
