బాలీవుడ్‌లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ మైథలాజికల్ మూవీ ‘రామాయణ’పై అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ‘దంగల్’ ఫేమ్ నితీష్ తివారీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో రణ్‌బీర్ కపూర్ శ్రీరాముడిగా, సాయి పల్లవి సీతాదేవిగా, రవి దూబే లక్ష్మణుడిగా, యశ్ రావణుడిగా నటిస్తున్నారు. తాజాగా ఈ ప్రధాన పాత్రలకు సంబంధించిన కొత్త క్యారెక్టర్ పోస్టర్లను మేకర్స్ విడుదల చేశారు. దీంతో ఈ లుక్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ముఖ్యంగా రావణుడిగా యశ్ పోస్టర్ ప్రత్యేకంగా ఆకట్టుకుంటోంది. భారీ కిరీటం, బంగారు ఆభరణాలతో లంకాధిపతి గెటప్‌లో యశ్ కనిపించారు. ఆయన ముఖంలో కనిపిస్తున్న గంభీరత, కళ్లలోని రౌద్రం రావణుడి పాత్రను ఎలా చూపించబోతున్నారనే ఆసక్తిని పెంచుతోంది. మరోవైపు రణ్‌బీర్ కపూర్, సాయి పల్లవి, రవి దూబేలను వనవాస సమయంలోని పాత్రలుగా పరిచయం చేస్తూ విడుదల చేసిన పోస్టర్ కూడా ప్రత్యేకంగా నిలిచింది. రాముడిగా రణ్‌బీర్ విల్లుతో కనిపించగా.. లక్ష్మణుడిగా రవి దూబే కూడా విల్లు ధరించి ఉన్నారు. సీత పాత్రలో సాయి పల్లవి సంప్రదాయ దుస్తుల్లో కనిపించారు.
ఇదిలా ఉంటే.. ‘రామాయణ’ను రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు. నితీష్ తివారీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని నమిత్ మల్హోత్రా నేతృత్వంలోని ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్, యశ్‌కు చెందిన మాన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్‌తో కలిసి నిర్మిస్తున్నాయి. విజువల్ ఎఫెక్ట్స్ కోసం DNEGతో పాటు ఇతర అంతర్జాతీయ సాంకేతిక బృందాలు పనిచేస్తున్నాయి. ఇక ఈ సినిమాలో హనుమంతుడిగా సన్నీ డియోల్, దశరథుడిగా అరుణ్ గోవిల్, కైకేయిగా లారా దత్తా, శూర్పణఖగా రకుల్ ప్రీత్ సింగ్ తదితరులు నటిస్తున్నారు.
మరోవైపు.. ‘రామాయణ’ మొదటి భాగాన్ని 2026 దీపావళి సందర్భంగా విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేశారు. రెండో భాగం 2027 దీపావళికి ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్, హాన్స్ జిమ్మర్ కలిసి సంగీతం అందించడం కూడా ప్రత్యేక ఆకర్షణగా మారింది. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ సినిమాపై ఆసక్తిని పెంచగా.. తాజాగా వచ్చిన రాముడు, సీత, లక్ష్మణుడు, రావణుడి పోస్టర్లు ఆ అంచనాలను మరింత పెంచుతున్నాయి.
[Ramayana Movie, Ramayana First Look, Yash Ravana Look, Ranbir Kapoor Ram, Sai Pallavi Sita, Ravi Dubey Lakshman, Ramayana Part 1, Nitesh Tiwari Ramayana, Yash Ramayana, Ranbir Kapoor Ramayana, Sai Pallavi Ramayana, Bollywood Mythological Movie, Ramayana New Posters]





