
బాలీవుడ్ స్టార్ రణ్‌బీర్ కపూర్ రాముడిగా, సాయిపల్లవి సీతగా, యశ్ రావణుడిగా నటించిన భారీ చిత్రం ‘రామాయణం’ విడుదలకు సిద్ధమైంది. రేపు(నవంబర్ 5) విడుదల కానున్న ఈ సినిమాపై ఇప్పటికే దేశవ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి. టీజర్, ట్రైలర్ తోనే మంచి బజ్ క్రియేట్ చేసిన ఈ సినిమా.. ఇప్పుడు అడ్వాన్స్ బుకింగ్స్‌తో సంచలనం సృష్టిస్తోంది. ట్రేడ్ వర్గాల అంచనాల ప్రకారం తొలి రోజే ప్రపంచవ్యాప్తంగా రూ.150 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించే అవకాశం ఉందట.
అడ్వాన్స్ బుకింగ్స్ విషయానికి వస్తే.. నవంబర్ 4 ఉదయం నాటికి ఇండియాలో ఓపెనింగ్ వీకెండ్‌కు సంబంధించి సుమారు రూ.77 కోట్ల గ్రాస్ ప్రీ సేల్స్ నమోదైనట్లు ట్రేడ్ రిపోర్టులు చెబుతున్నాయి. ఇందులో తొలి రోజు అడ్వాన్స్ బుకింగ్స్ వాటా దాదాపు రూ.33 కోట్లు. ఓవర్సీస్‌లో కూడా మంచి స్పందన కనిపిస్తోంది. నార్త్ అమెరికాలో పెయిడ్ ప్రీమియర్స్‌తో కలిపి భారీగా టికెట్లు అమ్ముడవుతున్నాయి. ఇండియా, ఓవర్సీస్ కలిపి గ్లోబల్ అడ్వాన్స్ బుకింగ్స్ రూ.125 కోట్ల నుంచి రూ.140 కోట్ల స్థాయికి చేరినట్లు ట్రేడ్ రిపోర్టులు వెల్లడించాయి.
ఈ ట్రెండ్ ఇలాగే కొనసాగితే ఇండియాలోనే దాదాపు రూ.80 కోట్ల నెట్ ఓపెనింగ్ సాధించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఓవర్సీస్ కలెక్షన్స్ కూడా కలిపితే మొదటిరోజు ప్రపంచవ్యాప్తంగా రూ.150 కోట్ల నుంచి రూ.160 కోట్ల వరకు గ్రాస్ వసూళ్లు రావచ్చని ట్రేడ్ వర్గాల అంచనా. పాజిటివ్ టాక్ వచ్చి ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ పెరిగితే రూ.200 కోట్ల మార్కును కూడా తాకవచ్చని అంటున్నారు.
ఇది కూడా చదవండి: ‘రామాయణ’పై అల్లు అర్జున్ ట్వీట్.. ఇది సినిమా మాత్రమే కాదు.!

[Ramayana Day 1 Box Office Prediction, Ramayana Day 1 Collection, Ramayana Box Office, Ramayana Movie, Ranbir Kapoor, Sai Pallavi, Yash, Nitesh Tiwari, Namit Malhotra]






