
బాక్స్ ఆఫీస్ హీరోయిన్ కట్ అవుట్ కి కూడా సలాం మహారాణి అంటుందని నిరూపించి కలెక్షన్స్ ల వర్షాన్ని కురిపించిన అతి తక్కువ హీరోయిన్స్ లో శ్రద్ధా కపూర్ ఒకరు. ప్రీవియస్ మూవీ 'స్త్రీ 2' నే ఉదాహరణ. ఆ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 857 కోట్ల భారీ వసూళ్లని రాబట్టి, ఇండియన్ సినిమా చరిత్రలో సరికొత్త రికార్డులని సృష్టించింది. ఈ బ్లాక్‌బస్టర్ విజయం తర్వాత ఆమె క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. పరిశ్రమలో ఆమెకు వరుస అవకాశాలు క్యూ కట్టాయి. అయితే, అందరూ ఊహించిన దానికి విరుద్ధంగా శ్రద్ధా కపూర్ మాత్రం వెంటనే ఏ కొత్త ప్రాజెక్ట్‌ను అంగీకరించలేదు. దీనికి సంబంధించిన అసలు కారణాన్ని తాజాగా ఆమె ఒక ఇంటరాక్టివ్ సెషన్లో అభిమానులతో పంచుకున్నారు.
'స్త్రీ 2' వంటి అఖండ విజయం సాధించిన తర్వాత పెద్ద సినిమాలు, భారీ రెమ్యూనరేషన్‌తో కూడిన ఆఫర్లు వచ్చాయి. ఎంతో మంది నిర్మాతలు ఆమెను తమ చిత్రాల కోసం సంప్రదించి భారీ మొత్తంలో అడ్వాన్స్‌లు ఇచ్చేందుకు ముందుకు వచ్చారు. అయినప్పటికీ ఏ ఒక్క సినిమాకి సంతకం చేయలేదు. నాకు ఎప్పుడైతే మనసుకు నచ్చే పరిపూర్ణమైన కథ (‘పర్ఫెక్ట్ స్టోరీ’) దొరుకుతుందో, అప్పటివరకు ఎలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని తాను ముందే గట్టిగా నిర్ణయించుకున్నట్లు ఆమె తెలిపారు.కెరీర్లో ఎంతటి విజయాలు సాధించినా, భారీ ఆఫర్లు వెల్లువెత్తినా వాటికి వెళ్లకుండా కథే ప్రధానమని భావించడం నిజంగా సాహసోపేతమైన విషయమే. ఈ విరామం గురించి మాట్లాడుతూ, కెరీర్లో తనకు కావలసిన దానికోసం ఎదురుచూడటం మొదట్లో కాస్త కష్టంగా అనిపించినా, చివరికి ఆ నిరీక్షణ వృథాపోలేదని ఆమె గర్వంగా చెప్పారు. మన అంతరత్మ చెప్పే మాటను ఎప్పుడూ నమ్మాలని, ఇబ్బందికర పరిస్థితులు ఎదురైనా సరైన దానికోసం వేచి చూడటం పూర్తిగా సార్థకమవుతుందని యువతకు, ముఖ్యంగా మహిళలకి విలువైన సలహా ఇచ్చారు.
ఇది కూడా చదవండి: హీరోయిన్స్ పై రెజీనా వ్యాఖ్యలు వైరల్: సమర్థిస్తున్న మెజారిటీ నెటిజెన్స్!

ప్రస్తుతం శ్రద్దా కపూర్ ‘ఈఠా’ (Eetha) కోసం సిద్ధమవుతుంది. మహారాష్ట్రకి చెందిన ప్రసిద్ధ లావణి కళాకారిణి విఠాబాయి నారాయణ్గావ్కర్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతుండగా శ్రద్దా కపూర్ టైటిల్ రోల్. దీన్ని బట్టి అంచనాలు ఏ స్థాయిలో ఉంటాయో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. డిసెంబర్ 4 రిలీజ్ డేట్. స్త్రీ 2 ఆగస్టు 15 , 2024 న రిలీజయ్యింది.
[Shraddha Kapoor Reveals Why She Did Not Sign Films After Stree 2, Shraddha kapoor about latest News, Shraddha Kapoor, Stree 2 movie, Tollywod, tollywood News, Telugu Cinema, Telugu CInema News]





