
టైగర్ ష్రాఫ్ పై జరిగిన కాల్పులు సృష్టించిన సంచలనం తెలిసిందే. ఈ సంచలన కేసులో ఇప్పటికే కొన్ని అరెస్ట్ లు జరిగిన విషయం తెలిసిందే. దీంతో రాబోయే రోజుల్లో ఇంకెవరరు అరెస్ట్ అవుతారో అనే ఆసక్తి కూడా అందరిలో ఉంది.
ఈ నేపథ్యంలో తాజాగా హర్యానా రాష్ట్రం కర్నాల్ జిల్లాకు చెందిన 22 ఏళ్ల యువతిని పోలీసులు అరెస్ట్ చేశారు. సుభేహా పండిట్ గా గుర్తించిన ఈ నిందితురాలి అరెస్టుతో ఈ కేసులో అరెస్టయిన వారి మొత్తం సంఖ్య 13కి చేరుకుంది. సుభేహా పండిట్ కి ఒక వ్యవస్థీకృత నేర ముఠాతో సంబంధాలు కలిగి ఉన్నట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. ఈ కేసులో ఇప్పటికే రాధా, బబితా అనే ఇద్దరు మహిళలని ఆయుధాలు సరఫరా చేసిన ఆరోపణలపై అరెస్ట్ చేయగా, ఇప్పుడు ఈ సుభేహా పండిట్ రూపంలో మూడో మహిళ అరెస్టయింది. నిందితులకు వాట్సాప్ చాట్‌లు, హ్యాండ్లర్ల ద్వారా రియల్ టైమ్ అప్‌డేట్‌లు అందాయని, మీడియాలో వస్తున్న వార్తల ద్వారా కూడా వారు ఎప్పటికప్పుడు అప్రమత్తమయ్యారని పోలీసుల విచారణలో వెల్లడైంది. ప్రస్తుతం ఈ కేసులో తదుపరి విచారణను ముమ్మరం చేసిన ముంబై క్రైమ్ బ్రాంచ్ అధికారులు, ఈ ముఠా వెనుక ఉన్న అసలు సూత్రధారులు ఎవరనే దానిపై కూపీ లాగుతున్నారు.
ఇది కూడా చదవండి: అనుపమ పరమేశ్వరన్ పిక్ చూపించేసింది: ఆ పాప ఎవరో తెలుసా..సంబరాల్లో ఫ్యాన్స్!
.webp)
ఈ కేసుకు సంబంధించి ఇప్పటివరకు ముంబై క్రైమ్ బ్రాంచ్ అధికారులు పకడ్బందీగా దర్యాప్తు జరుపుతూ ఒక్కొక్కరిని అదుపులోకి తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే అక్టోబర్ 27వ తేదీన ఈ కేసు తీవ్రతను దృష్టిలో ఉంచుకుని అత్యంత కఠినమైన మహారాష్ట్ర కంట్రోల్ ఆఫ్ ఆర్గనైజ్డ్ క్రైమ్ యాక్ట్ (MCOCA), 1999 చట్టంలోని సెక్షన్లు 3(1)(ii), 3(2) మరియు 3(4) లను ప్రయోగించారు.
[Tiger Shroff Firing Case Karnal Arrest, Tiger Shroff firing case, Mumbai Crime Branch, Subeha Pandit arrest, Karnal woman arrested, TeluguCinema, TeluguCinema news, Tollywood, Tollywood News]




