హృతిక్ రోషన్‌పై ఎన్టీఆర్ కామెంట్స్.. వైరల్ అవుతున్న ట్వీట్!
on Jul 7, 2025
ఎన్టీఆర్, హృతిక్ రోషన్ ప్రధాన పాత్రల్లో అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో యష్‌రాజ్ ఫిలింస్ నిర్మిస్తున్న ఈ సినిమాపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో ఎన్టీఆర్ క్యారెక్టర్ ఎలా ఉండబోతోంది. ఫస్ట్ టైమ్ ఎన్టీఆర్ ఒక హిందీ సినిమాలో నటిస్తుండడంతో ‘వార్2’పై అందరిలోనూ ఆసక్తి పెరిగింది. ఆమధ్య విడుదలైన టీజర్‌తో సినిమా ఎలా ఉండబోతోంది, ఎంత భారీగా యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరించారు అనేది అర్థమైంది. ఆగస్ట్ 14న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో సినిమాకి సంబంధించి ఎన్టీఆర్ చేసిన ఎమోషనల్ ట్వీట్ అందర్నీ ఆకట్టుకుంటోంది. ఈ చిత్రం షూటింగ్ పూర్తయిందని సోషల్ మీడియా ద్వారా ప్రేక్షకులకు, అభిమానులకు తెలియజేశారు ఎన్టీఆర్. దీనికి సంబంధించిన ట్వీట్ ఇప్పుడు వైరల్‌గా మారింది.
‘వార్2 షూటింగ్ పూర్తయింది. ఈ సెట్స్ నుంచి వెనక్కి రావడం అనేది ఎంతో బాధ కలిగించిన విషయం. హృతిక్‌సర్‌తో పనిచేయడం నిజంగా చాలా గ్రేట్ ఎక్స్‌పీరియన్స్. ఆయనలోని ఎనర్జీని చూసి నేను ఎప్పుడూ ఆశ్చర్యపోతుంటాను. ‘వార్2’ చిత్రం కోసం చేసిన జర్నీలో ఆయన నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. ఇక డైరెక్టర్ అయాన్ గురించి చెప్పాలంటే అతనో అద్భుతంగా. ప్రేక్షకుల కోసం పెద్ద సర్‌ప్రైజ్‌ని ప్లాన్ చేశారు. యష్‌రాజ్ ఫిలింస్ యూనిట్‌లోని అందరూ నాపై ఎంతో ప్రేమ చూపించారు. సినిమా కోసం ఎంతో ఎఫర్ట్ పెట్టారు. వారందరికీ చాలా చాలా థాంక్స్. మీకు గ్రేట్ ఎక్స్‌పీరియన్స్ ఇచ్చేందుకు వస్తున్న ‘వార్2’ కోసం ఆగస్ట్ 14 వరకు వెయిట్ చెయ్యలేరని తెలుసు. ఒక గొప్ప అనుభూతి కోసం మరి కొద్దికాలం ఎదురుచూడక తప్పదు’ అంటూ ఎంతో ఎమోషనల్‌గా ఎన్టీఆర్ చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ అయింది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



