ఊపిరి ఊయలగా సాంగ్.. ఫ్యాన్స్ కి కియారా గ్లామర్ ట్రీట్!
on Jul 31, 2025

జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్, కియారా అద్వానీ ప్రధాన పాత్రలు పోషిస్తున్న చిత్రం 'వార్ 2'. యశ్ రాజ్ ఫిలిమ్స్ స్పై యూనివర్స్ లో భాగంగా వస్తున్న ఈ చిత్రానికి అయాన్ ముఖర్జీ దర్శకుడు. ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు రానున్న 'వార్ 2'పై మంచి అంచనాలు ఉన్నాయి. ఇటీవల విడుదలైన ట్రైలర్ యాక్షన్ ప్రియులను మెప్పించింది. తాజాగా ఈ సినిమా నుంచి సాంగ్ విడుదలైంది.
'వార్ 2' విడుదలకు ఇంకా రెండు వారాలే సమయముంది. దీంతో సాంగ్స్ తో ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు మేకర్స్. ఫస్ట్ సింగల్ గా 'ఊపిరి ఊయలగా' సాంగ్ ను రిలీజ్ చేశారు. హృతిక్ రోషన్, కియారా అద్వానీలపై తీసిన ఈ రొమాంటిక్ పాట ఇప్పుడు సోషల్ మీడియాలో సందడి చేస్తోంది.
'బ్రహ్మాస్త్ర'లోని బ్లాక్‌బస్టర్ సాంగ్ 'కేసరియా'ని కంపోజ్ చేసిన టీం ఈ రొమాంటిక్ సాంగ్ రూపొందించారు. ప్రీతమ్ స్వరపరిచిన ఈ పాటకు హిందీలో అమితాబ్ భట్టాచార్య లిరిక్స్, అరిజిత్ సింగ్ గాత్రాన్ని అందించారు. ఇక తెలుగులో ఈ పాటకు చంద్రబోస్ సాహిత్యం అందించగా.. శాశ్వత్ సింగ్, నిఖితా గాంధీ ఆలపించారు.
'ఊపిరి ఊయలగా' సాంగ్ వినసొంపుగా ఉంది. విజువల్స్ కూడా కలర్ ఫుల్ గా ఉన్నాయి. హృతిక్, కియారా మధ్య బ్యూటీఫుల్ కెమిస్ట్రీ, పాటను తెరకెక్కించిన విధానం, లోకేషన్స్ అన్నీ కూడా అద్భుతంగా ఉన్నాయి. కియారా పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేసిన ఈ పాట.. ఆమె ఫ్యాన్స్ కి ట్రీట్ అని చెప్పవచ్చు. ఈ సాంగ్ లో కియారా బికినీలో దర్శనమిచ్చింది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



