ఆలియా భట్ మూవీ విడుదల వాయిదా.. థాంక్స్ చెప్పిన రాజమౌళి!
on Nov 15, 2021

దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న భారీ మల్టీస్టారర్ 'ఆర్ఆర్ఆర్'. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాలో.. ఎన్టీఆర్ కు జోడీగా ఒలివియా మోరిస్, చరణ్ కు జోడీగా ఆలియా భట్ నటిస్తున్నారు. అయితే తన సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న ఆలియా భట్ మూవీ 'గంగూబాయి కథియావాడి' పోస్ట్ పోన్ అయినందుకు రాజమౌళి హ్యాపీగా ఫీలవుతున్నారు. అంతేకాదు ఆ సినిమా దర్శకనిర్మాతలకు థాంక్స్ కూడా చెప్పారు.
'ఆర్ఆర్ఆర్' మూవీని 2022,జనవరి 7న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు ఇటీవల మేకర్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. 'ఆర్ఆర్ఆర్' రాకతో పలు టాలీవుడ్ బడా మూవీ పోస్ట్ పోన్ అయ్యాయి. ఇప్పుడు సంజయ్ లీలా భన్సాలీ, ఆలియా భట్ కాంబినేషన్ లో వస్తున్న బాలీవుడ్ మూవీ 'గంగూబాయి కథియావాడి' కూడా పోస్ట్ పోన్ అయింది. గంగూబాయిని మొదట జనవరి 6న విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేశారు. అయితే అనుకోకుండా జనవరి 7ని 'ఆర్ఆర్ఆర్' టీమ్ లాక్ చేసింది. అయితే భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా మూవీగా వస్తున్న 'ఆర్ఆర్ఆర్'కు.. భన్సాలీ, ఆలియాలకు ఉన్న క్రేజ్ దృష్ట్యా గంగూబాయి మూలంగా హిందీ మార్కెట్ కలెక్షన్లపై ఎఫెక్ట్ పడేది. అయితే ఇప్పుడు 'గంగూబాయి కథియావాడి' ఫిబ్రవరికి వెళ్లి 'ఆర్ఆర్ఆర్'కు రూట్ క్లియర్ చేసింది.
'గంగూబాయి కథియావాడి' మూవీని 2022, ఫిబ్రవరి 18న విడుదల చేస్తున్నట్లు తాజాగా మేకర్స్ ప్రకటించారు. 'ఆర్ఆర్ఆర్' భామ ఆలియా నటిస్తున్న సినిమా కావడం.. మరోవైపు గంగూబాయి నిర్మాతల్లో ఒకరైన పెన్ స్టూడియోస్ అధినేత జయంతిలాల్ గడా 'ఆర్ఆర్ఆర్'ను డిస్ట్రిబ్యూట్ చేస్తుండటంతో.. రెండు సినిమా నిర్మాతల మధ్య అవగాహన కుదిరి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ నిర్ణయంపై రాజమౌళి సంతోషం వ్యక్తం చేశారు. జయంతిలాల్ గడా, సంజయ్ లీలా భన్సాలీలకు ఆయన థాంక్స్ చెప్పారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



