ఫైటర్ వచ్చేది అప్పుడే
on Nov 25, 2023
బాలీవుడ్ సూపర్ స్టార్ హృతిక్ రోషన్ హీరోగా దీపికా పదుకొనె హీరోయిన్ గా అత్యంత భారీ వ్యయంతో పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతున్న మూవీ ఫైటర్.. వార్ ,పఠాన్ లాంటి హిట్ చిత్రాలని తెరకెక్కించిన సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీకి సంబంధించిన తాజా వార్త ఒకటి హృతిక్ అభిమానులతో పాటు భారతీయ సినీ ప్రేక్షకులని ఆనందంలో ముంచెత్తుతుంది.
ఫైటర్ మూవీ 2024 జనవరి 25న ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్లలో విడుదల కాబోతుంది. ఈ మూవీలో విఎఫ్ఎక్స్ వర్క్ ఇంతవరకు ఏ భారతీయ సినిమాలో కూడా రాని రీతిలో అత్యున్నత ప్రమాణాలతో ఉండబోతున్నాయి. అలాగే త్వరలోనే ఈ చిత్రం యొక్క ఫస్ట్ లుక్ అండ్ టీజర్ ని కూడా చిత్ర బృందం విడుదల చేయనుంది. ఇప్పుడు ఈ వార్తలతో భారతీయ సినీ ప్రేక్షకుల్లో నయా జోష్ వచ్చింది. ఎందుకంటే హృతిక్ రోషన్ నుంచి వచ్చే ప్రతి సినిమా కూడా ప్రేక్షకుడికి ఒక సరికొత్త అనుభూతిని కలుగచేస్తుంది. ఆయన నుండి వచ్చిన గత చిత్రాలే అందుకు ఉదాహరణ.
ఈ ప్రతిష్టాత్మక ఫైటర్ చిత్రాన్ని వయాకామ్ 18 స్టూడియోస్, మార్ ఫ్లిక్స్ పిక్చర్స్ సంస్థల పై సిద్ధార్థ్ ఆనంద్, జ్యోతి దేశ్‌పాండే, అజిత్ అంధరే, మమతా ఆనంద్, రామన్ చిబ్, అంకు పాండే నిర్మిస్తుండగా
విశాల్ శేఖర్ సంగీతాన్ని అందిస్తున్నారు. దర్శకుడు సిద్దార్థ్ ఆనంద్ ఫైటర్ తో హ్యాట్రిక్ నమోదు చెయ్యడం ఖాయమని కూడా అంటున్నారు.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
