చిక్కుల్లో ఏక్తా కపూర్.. ఆల్ట్ బాలాజీ బ్యాన్..!
on Oct 22, 2024
బాలీవుడ్ నిర్మాత ఏక్తా కపూర్ (Ekta Kapoor) చిక్కుల్లో పడింది. ఆమెపై పై పోక్సో కేసు నమోదైంది. ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఆల్ట్ బాలాజీలో ప్రసారమవుతోన్న 'గంధీ బాత్ సీజన్-6' సిరీస్ కు సంబంధించి ముంబై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ సిరీస్ లో మైనర్లకు సంబంధించిన అసభ్యకరమైన దృశ్యాలను చూపించారన్న ఫిర్యాదుతో ఏక్తా కపూర్ తో పాటు, ఆమె తల్లి శోభా కపూర్‌పై పోక్సో కేసు నమోదైంది.
ఏక్తా కపూర్ కి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పెద్ద యుద్ధమే జరుగుతోంది. అభ్యంతర మరియు భారతీయ సంస్కృతిని అవమానించేలా ఉన్న కంటెంట్ ని ప్రసారం చేస్తున్న ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఆల్ట్ బాలాజీని బ్యాన్ చేయాలని డిమాండ్స్ వినిపిస్తున్నాయి. #BanAltBalaji హ్యాష్ ట్యాగ్ ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉంది. అలాగే ఏక్తా కపూర్ కి ప్రదానం చేసిన పద్మశ్రీ పురస్కారాన్ని రద్దు చేయాలని కొందరు సోషల్ మీడియా వేదికగా కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కోరుతున్నారు.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
