షారుఖ్‌తో కశ్మీర్‌కి వెళ్లిన తాప్సీ
on Apr 28, 2023
బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్‌తో కలిసి కశ్మీర్‌కి ఫ్లైట్ ఎక్కేశారు మన బొద్దుగుమ్మ తాప్సీ. బాలీవుడ్ ఇప్పుడు వ్యాలీలమీద మోజు పెంచుకుంటోంది. ఇటీవలి కాలంలో కశ్మీర్ పరిసరాల్లో షూటింగులు విపరీతంగా జరుగుతున్నాయి. కశ్మీర్ ప్రాంతంలో టూరిజం డెవలప్ చేయడానికి సినిమా స్టార్స్ తమవంతు సాయం చేస్తున్నారు. ఆ దశగానే బ్యాక్ టు బ్యాక్ మూవీస్ కశ్మీర్‌కి ట్రావెల్ చేస్తున్నాయి. లేటెస్ట్ గా డంకీ సినిమా షూటింగ్ కూడా అక్కడ జరుగుతోంది. కశ్మీర్‌లో సినిమాల షూటింగుల గురించి సోనామార్గ్ డెవలప్‌మెంట్ అథారిటీ సీఈఓ ఇలియాస్ అహ్మద్ మాట్లాడుతూ ``షారుఖ్‌ఖాన్, తాప్సీ పన్నులాంటివాళ్లు కేవలం వాళ్ల సినిమాల షూటింగుల కోసం మాత్రమే రావడం లేదు, వాళ్లు ఇక్కడికి రావడం వల్ల టూరిజమ్ డెవలప్ అవుతుంది. ప్రపంచ పటంలో కశ్మీర్ ఉన్న ప్లేస్ గురించి ఎక్కువమంది చూస్తారు`` అని అన్నారు. రాజ్‌కుమార్ హిరానీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా డంకీ. విక్కీ కౌశల్ కూడా ఈ సినిమాలో కీ రోల్ చేస్తున్నారు.
``ఇప్పుడు సౌత్ నుంచి ఎక్కువ మంది వచ్చి ఇక్కడ సినిమాలు చేస్తున్నారు. సీతారామమ్, ఖుషీ, లియోలాంటి సినిమా టీమ్‌లు వచ్చి వెళ్లాయి. బాలీవుడ్ నుంచి కూడా ఇంకా స్టార్ హీరోలు పలువురు వస్తేబావుంటుంది. వాళ్లకు ఎలాంటి అసౌకర్యమూ కలగకుండా మేం ఇక్కడ కావాల్సిన ఏర్పాట్లు చూసుకుంటాం`` అని స్థానిక హోటల్ వ్యక్తి చెప్పారు. తమని చూసి అక్కడివారు సొంత మనుషుల్లా ట్రీట్ చేస్తుంటే ఆనందంగా ఉందని చెప్పారు తాప్సీ. బార్‌సత్ సినిమాలోనే కశ్మీర్ ప్రస్తావన ఉంది. అప్పటి నుంచి కశ్మీర్ కి కాళీ, జబ్ జబ్ పూల్ ఖిలే, బాబీ లాంటి సినిమాలన్నీ 60-70ల్లో కశ్మీర్‌లో తెరకెక్కినవే. మిషన్ కశ్మీర్, హైదర్‌లాంటి సినిమాలు 2000లో అక్కడి ప్రదేశాలను మరోసారి ప్రేక్షకులకు పరిచయం చేశాయి. ప్రస్తుతం అక్కడ షారుఖ్ ఖాన్, తాప్సీ మీద పాట చిత్రీకరిస్తున్నారు. షారుఖ్ మరోవైపు జవాన్‌తో బిజీగా ఉంటే, తాప్సీ ఓ లడ్కీ హై కహాన్, ఫిర్ ఆయీ హసీన్ దిల్‌రుబాతో బిజీగా ఉన్నారు.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
