సినిమా చూడాలనుకుంటున్నారా? నేను ఎరేంజ్ చేస్తా : షారూక్
on Sep 28, 2023
షారూక్ ఖాన్ హీరోగా వచ్చిన ‘జవాన్’ ఎంతటి సంచలన విజయం సాధించిందో తెలసిందే. ఇప్పటికే 1000 కోట్ల రూపాయల మార్క్‌ను దాటేసిన ఈ సినిమా ప్రభంజనం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ సందర్భంలో షారూక్ ఆడియన్స్‌తో ఇంటరాక్ట్ అవుతున్నారు. వారు అడిగే ప్రశ్నలకు ఓపికగా సమాధానం చెబుతూ వారికి మరింత దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు.
ఇటీవల ఓ వీరాభిమాని అయిన అమ్మాయి షారూక్ సొట్టపడే బుగ్గపై ముద్దు పెట్టుకోవచ్చా? అని అడిగింది. దానికి షారూక్ దానికి సరదాగా ‘కుడివైపా, ఎడమవైపా.. ముందు అది అడ్వాన్స్ బుకింగ్ చేసుకోండి’ అంటూ సరదాగా చెప్పాడు. మరో అభిమాని తనకు ‘జవాన్’ సినిమా చూడాలని వుందని, అయితే హౌస్‌ఫుల్ ఉంటోందని వాపోయింది. దానికి షారూక్ ‘మీ ప్రియమైన వారితో కలసి సినిమా చూడాలని మీకు వుంటే అది నేను ఎరేంజ్ చేస్తాను’ అంటూ అభిమానిని అలరించారు.
ఈ సందర్భంగా షారూఖ్ మాట్లాడుతూ ‘జవాన్’తో నా కల సాకారమైంది. ఇప్పటివరకు కొన్ని లక్షల మంది ఈ సినిమాను చూసి నన్ను ఆదరించారు. నిజానికి నేను ఇంత గాఢమైన అభిమానానికి అర్హత సాధిస్తానని ఎప్పుడూ అనుకోలేదు’ అన్నారు. ప్రస్తుతం షారూఖ్ ఖాన్ చేస్తున్న సినిమా పేరు ‘డంకీ’. రాజ్‌కుమార్ హిరాణి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో తాప్సీ హీరోయిన్. నవంబర్ 22న ఈ సినిమా రిలీజ్ కాబోతోంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



