రామాయణలో చెయ్యను..నాకంటు ప్రేక్షకుల్లో ఒక బ్రాండ్ ఉంది
on Mar 4, 2025
రణబీర్ కపూర్(Ranbir Kapoor)రాముడిగా,సాయిపల్లవి(sai Pallavi)సీతగా, యష్(yash)రావణాసురుడు గా కనిపిస్తున్న చిత్రం 'రామాయణ'(Ramayana).ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ మూవీకి 'నితీష్ తివారి'(Nitish Tiwari)దర్శకుడు కాగా,2026 లో ప్రేక్షకుల ముందుకు రానుంది.భారతీయుల ఆరాధ్యదైవమైన శ్రీరామచంద్రుడికి సంబంధించిన జీవిత కథ కావడంతో,ఎంతో మంది నటులు,నటీమణులు ఈ మూవీలో నటించడానికి ఆసక్తి చూపిస్తున్నారు.
కానీ భారతీయ సినీ ప్రేక్షకుల మొట్టమొదటి 'సీతమ్మ' దీపికా చికిలా'(Dipika Chikhlia)రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతు'రామాయణ' మూవీలో ఎలాంటి ఆఫర్ వచ్చిన నేను చెయ్యను.నేను చేసిన 'రామాయణ' తర్వాత అదే కాన్సెప్ట్ తో తెరకెక్కిన కొన్నింటిలో 'కౌసల్య' క్యారక్టర్ కోసం సంప్రదిస్తే చెయ్యాలా వద్దా అని ఆలోచించాను.'నిన్ను 'సీత'గా అందరు గుర్తుంచుకున్నారు.నువ్వు 'సీత'గానే మిగిలిపోవాలని నా తమ్ముడు చెప్పాడు.ఆ మాటలు నా మనసుని హత్తుకున్నాయి.దేవతలకి సంబంధించిన క్యారెక్టర్స్ చేసినప్పుడు ప్రేక్షకులు కూడా మనల్ని దేవతలుగానే గుర్తుంచుకుంటారు.అందుకే ఆ గుర్తింపుని పోగొట్టుకోకూడదని ఎన్నో ఆఫర్స్ ని తిరస్కరించాను.ఎప్పటికి అలనాటి 'రామాయణ' 'సీత'గానే మిగిపోతానని చెప్పుకొచ్చింది.
రామాయణానికి సంబంధించి ఎన్నో సినిమాలు, ఎన్నో సీరియల్స్ వచ్చినప్పటికీ,1987 నుంచి 88 వరకు DD నేషనల్‌లో ప్రసారమైన 'రామాయణ' సీరియల్ ని ఎవరు మర్చిపోలేరు.ఒక బిడ్డకి అమ్మ తొలి స్పర్శ ఎలాగో,రామాయణ సీరియల్ కూడా భారతీయులకి అంతే.ఈ సీరియల్ ద్వారానే 'రామాయణం' పలానా విధంగా జరిగిందని ప్రతి ఒక్కరు తెలుసుకున్నారు.రాముడు గా అరుణ్ గోవిల్, సీతమ్మ తల్లిగా దీపికా చికిలా తమ పెర్ ఫార్మెన్సు తో సాక్షాత్తు ఆ శ్రీరామచంద్రుడు,సీతమ్మ తల్లి కళ్ళ ముందు మెదిలేలా చేసారు. రామానంద సాగర్ దర్శకత్వం వహించగా,ప్రపంచంలోనే అత్యధికంగా వీక్షించబడిన టెలివిజన్ సిరీస్‌గా కూడా వరల్డ్ రికార్డు సాధించింది.రీ టెలికాస్ట్ లో కూడా ఐదు ఖండాల్లోని 17 దేశాలలో 20 వేర్వేరు ఛానెళ్లలో ప్రసారం చేయబడింది.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
