బ్లాక్‌బస్టర్ హిట్స్ అందించిన డైరెక్టర్ మృతి!
on Nov 24, 2023
భారతీయ చలన చిత్ర రంగంలో మరో విషాదం చోటు చేసుకుంది. ఎన్నో వైవిధ్యమైన సినిమాలకు నిర్మాతగా, దర్శకుడిగా వ్యవహరించిన రాజ్‌కుమార్ కోహ్లి మృతి చెందారు. రాజ్‌కుమార్ కోహ్లి మరణం బాలీవుడ్‌ను తీవ్ర విషాదంలోని నెట్టింది. నవంబర్ 24 ఉదయం రాజ్‌కుమార్ కోహ్లి(93) గుండెపోటుతో మరణించారు. నిర్మాతగా రాజ్‌కుమార్ చేసిన సినిమాలు తక్కువే. కానీ, డైరెక్టర్‌గానే ఆయన ఎక్కువ గుర్తింపు తెచ్చుకున్నారు.
నాగిన్, జాని దుష్మన్, బీస్ సాల్ బాద్, నౌకర్ బీవీ కా, ఇన్‌సానియత్ కె దుష్మన్, సాజిష్, జీనే నహి దూంగా, ముకాబ్‌లా వంటి బ్లాక్ బస్టర్స్ ఆయన కెరీర్‌లో ఉన్నాయి. 1966లో తన కెరీర్ ప్రారంభించిన రాజ్‌కుమార్ 2002 వరకు తన సినీ ప్రస్థానాన్ని కొనసాగించారు. ఎంతో మంది లైఫ్ ఇచ్చిన రాజ్‌కుమార్ కోహ్లి పంజాబీ సినిమాలనే ఎక్కువగా నిర్మించారు. డైరెక్టర్‌గా మాత్రం హిందీలో లెక్కకు మించిన సినిమాలను చేసి అప్పట్లో టాప్ డైరెక్టర్స్‌లో ఒకరిగా పేరు తెచ్చుకున్నారు. రాజ్‌కుమార్ మరణం పట్ల ఎంతోమంది బాలీవుడ్ ప్రముఖులు తమ సంతాపాన్ని తెలియజేస్తున్నారు. నవంబర్ 24 సాయంత్రమే ఆయన అంత్య క్రియలు జరిగాయి. ఆయన్ని కడసారి చూసేందుకు పలువురు బాలీవుడ్ ప్రముఖులు హాజరై నివాళులర్పించారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



