మసీద్‌లో అక్షయ్... చుట్టుముట్టిన జనాలు! ఏం జరిగింది?
on Jun 6, 2023
మామూలుగా, చిన్నా చితకా స్టార్ తమ చుట్టుపక్కల్లో ఉన్నారని తెలిస్తేనే ఒక్కసారి చూసొద్దాం అంటూ కిటకిటలాడుతారు జనాలు. అలాంటిది ఖిలాడీ స్టార్ అక్షయ్ ఉన్నారని తెలిస్తే ఊరుకుంటారా? క్షణాల్లో మూగేయరూ. అదే జరిగింది ఢిల్లీలో. రీసెంట్ టైమ్స్ లో ఉత్తరాఖాండ్ లో బిజీగా షూటింగ్ చేశారు అక్షయ్‌కుమార్. ఆ తర్వాత బేస్‌ని కేదార్‌నాథ్‌కి షిఫ్ట్ చేశారు.లేటెస్ట్ అక్షయ్ కేరాఫ్ ఢిల్లీ. ఆదివారం రాజధానిలోనే కనిపించారు అక్షయ్‌కుమార్. ఆయన తాజా సినిమా షూటింగ్ అక్కడ జరుగుతోంది. అది తెలుసుకున్న జనాలు జమా మసీద్‌లో కిక్కిరిసిపోయారు.
ఈ వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ వీడియోలో అక్షయ్ గ్రే షర్ట్ లో బ్లూ ప్యాంట్స్ లో ఉన్నారు. కూల్ సన్నీస్ ఆయన స్టైల్‌ని ఇరగదీశాయి. ఆయన బయటకు రాగానే ఫ్యాన్స్ అరుపులు, కేకలతో గోల చేశారు. వాళ్లను గమనించిన అక్షయ్ చేతిని ఊపి పలకరించారు. ఆయన సెక్యూరిటీ వెంటనే రౌండ్ కట్టేశారు. ఆయన షూటింగ్ చేసిన సినిమాకు శంకర అనే టైటిల్ పరిశీలనలో ఉంది.
ఎప్పుడు ఏ సినిమా మొదలుపెట్టినా ఫ్యాన్స్ కి చెప్పేసే అక్షయ్ ఇప్పుడు మాత్రం సైలెంట్‌గా ఉన్నారు. ఉత్తరాఖాండ్ షూటింగ్ అప్పుడు అక్షయ్ షేర్ చేసిన చాపర్ వీడియో మాత్రం కిర్రాక్ అనిపించింది. దైవ భూమి ఉత్తరాఖాండ్‌లో షూటింగ్ చేయడం పూర్వజన్మ సుకృతమని అన్నారు అక్షయ్. భద్రినాథ్ ధామ్ అద్భుతంగా అనిపించిందని, సాటి లేదని, మాటలు రావడం లేదని అప్పట్లో షేర్ చేసుకున్నారు అక్షయ్. అక్షయ్ గత చిత్రం సెల్ఫీ పెద్దగా ఆడలేదు. ఆయన ప్రస్తుతం బడేమియా చోటేమియాలో నటిస్తున్నారు. ఈ సినిమాలో అక్షయ్‌తో పాటు టైగర్ ష్రాఫ్ కూడా కీ రోల్ చేస్తున్నారు. అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వం వహిస్తున్నారు. సోనాక్షి సిన్హా, మానుషి చిల్లర్ హీరోయిన్లు. పృథ్విరాజ్ సుకుమారన్ కీ రోల్ చేస్తున్నారు. వచ్చే ఏడాది ఈద్‌కి విడుదలవుతుంది ఈ చిత్రం. దీంతో పాటు ఓ మై గాడ్2, కేప్సూల్ చిత్రాలు కూడా లైన్లో ఉన్నాయి అక్షయ్‌కి.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
