అభిషేక్,ఐశ్వర్యల జీవితానికి సంబంధించిన టార్గెట్ ఫిక్స్!
on Nov 7, 2024

ఇండియన్ సిల్వర్ స్క్రీన్ వద్ద ప్రముఖ జంట అభిషేక్ బచ్చన్(abhishek bachchan)ఐశ్వర్యరాయ్(aishwarya rai)నటప్రస్థానానికి ప్రత్యేక స్థానం ఉంటుంది.ప్రస్తుతం ఆ ఇద్దరు విడివిడిగా ఉంటున్నారని, త్వరలోనే విడాకులు కూడా తీసుకోబోతున్నారనే వార్తలు సోషల్ మీడియా వేదికగా కొన్ని రోజుల నుంచి వినిపిస్తూనే ఉన్నాయి. దీంతో ఆ ఇద్దరి అభిమానుల్లో కలవరం మొదలయ్యింది.ఈ నేపథ్యంలో ముంబై ఫిలింసర్కిల్స్ లో చక్కర్లు కొడుతున్న ఒక తాజా వార్త వాళ్లలో ఆనందాన్ని నింపుతుంది.
అభిషేక్, ఐశ్వర్యా లు కలిసి ఒక సినిమాలో చేయబోతున్నారని, ఇండియన్ గ్రేటెస్ట్ ఫిలిం డైరెక్టర్ మణిరత్నం(mani ratnam)ఆ ప్రాజెక్టుకి దర్శకత్వం వహించబోతున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి.ఇందుకు సంబంధించి మణిరత్నం ఆ ఇద్దరితో చర్చలు కూడా జరిపాడని, అభిషేక్, ఐశ్వర్య కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని అంటున్నారు.ఇప్పుడు ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారడమే కాకుండా వాళ్ళిద్దరి విడాకుల న్యూస్ కి కూడా చెక్ పెట్టినయ్యింది. ఐశ్వర్య ఇటీవల జరిగిన పారిస్ ఫ్యాషన్ వీక్ కి వెడ్డింగ్ రింగ్ ధరించి వచ్చిన విషయం అందరకి తెలిసిందే.
ఇక అభిషేక్, ఐశ్వర్య గతంలో మణిరత్నం దర్శకత్వంలో గురు(guru)సినిమాలో కలిసి నటించారు.ఆ ఇద్దరి పెళ్ళికి కొన్ని రోజుల ముందు విడుదలైన ఆ మూవీ మంచి విజయాన్నిఅందుకోవడమే కాకుండా,ఇద్దరి మధ్య కెమిస్ట్రీ కూడా బాగా గురు మూవీలో బాగా పండింది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



