అభిషేక్ బచ్చన్ సంచలన నిర్ణయం..కానీ అది జరగదు
on Mar 14, 2025
బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్(Amithab Bachchan)నట వారసుడు అభిషేక్ బచ్చన్(Abhishek Bachchan)2000 వ సంవత్సరంలో రెఫ్యూజీ అనే చిత్రంతో హిందీ చిత్ర రంగ ప్రవేశం చేసిన విషయం తెలిసిందే.ఆ తర్వాత ధూమ్,యువ,సర్కార్,కభీ అల్విదా నా కెహ్న,బంటీ ఔర్ బబ్లీ, గురు,బోల్ బచ్చన్, దోస్తానా, హౌస్ ఫుల్ 3 , ఐ వాంట్ టూ టాక్ లాంటి పలు చిత్రాల్లో నటించి తనకంటు ఒక ప్రత్యేకమైన గుర్తింపుని సంపాదించాడు.కాకపోతే స్టార్ హీరో అనే టాగ్ లైన్ మాత్రం అందని ద్రాక్షలాగా మారడమే కాకుండా విజయాల శాతం కూడా అంతంత మాత్రమే.
రీసెంట్ గా అభిషేక్ బచ్చన్ ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతు మా నాన్న వల్లే నేను సినిమా ఫీల్డ్ లోకి వచ్చాను.కానీ ఈ రంగంలో ఎన్నో ఎత్తు పల్లాలు చవి చూసాను.రకరకాల పాత్రలతో ప్రేక్షకులని అలరించాలని అనుకున్నాను.కానీ ఎన్ని సినిమాలు చేసినా కూడా నటుడిగా అనుకున్న స్థాయిని చేరుకోకపోవడంతో ఇండస్ట్రీ వదిలి వెళ్లిపోవాలని అనుకున్నాను.ఈ విషయం నాన్నతో కూడా చెప్పాను.అప్పుడు ఆయన నాతో 'ఇప్పుడే మొదలైన నీ ప్రయాణంలో ఎన్నో సవాళ్లు ఎదురవుతుంటాయి.
వాటన్నిటిని జీవిత పాఠాలుగా తీసుకొని ముందుకెళ్లాలి.ప్రతి సినిమా నుంచి ఒక్కో విషయం నేర్చుకుంటూ ముందుకు సాగితే ఏదో ఒక రోజు నువ్వనుకున్న స్థాయికి చేరుకుంటావు.కాబట్టి పోరాడుతునే ఉండని చెప్పాడు.ఆ మాటలతోనే నటుడుగా ఇంకా కొనసాగుతున్నాను.ఈ ప్రయాణంలో పరాజయం లేకుండా విజయాన్ని అందుకోలేరనే విషయాన్నీ కూడా గ్రహించానని చెప్పుకొచ్చాడు.ప్రస్తుతం అభిషేక్ బచ్చన్ నటించిన 'బీ హ్యాపీ' అనే మూవీ అమెజాన్ ప్రైమ్ వేదికగా విడుదలై విజయపథాన దూసుకుపోతుంది.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
