ఒక టాప్ బాలీవుడ్ యాక్టర్, జాకీ చాన్‌తో 'అపరిచితుడు' హిందీ రీమేక్!
on Nov 24, 2021

విక్రమ్ టైటిల్ రోల్ పోషించగా శంకర్ డైరెక్ట్ చేసిన బ్లాక్‌బస్టర్ ఫిల్మ్ 'అన్నియన్' (అపరిచితుడు)ను హిందీలో రీమేక్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు దాని నిర్మాత ఆస్కార్ రవిచంద్రన్ వెల్లడించారు. వాస్తవానికి హిందీలో రణవీర్ సింగ్‌తో ఈ మూవీని రీమేక్ చేయనున్నట్లు ఇదివరకు శంకర్ అనౌన్స్ చేశారు. అయితే ఆ మూవీ హిందీ రీమేక్ రైట్స్ తనవద్ద వున్నప్పుడు తనతో నిమిత్తం లేకుండా శంకర్ ఎలా రీమేక్ చేస్తారని ప్రశ్నిస్తూ, ఇదే విషయమై సౌత్ ఇండియన్ ఫిల్మ్ చాంబర్‌కు ఫిర్యాదు చేశారు రవిచంద్రన్.
ఇప్పుడు తనే సొంతంగా 'అన్నియన్'ను హిందీలో రీమేక్ చేయబోతున్నట్లు ఆయన చెప్పారు. "ఒక టాప్ బాలీవుడ్ యాక్టర్‌తో పాటు జాకీ చాన్‌తో హిందీలో అన్నియన్‌ను రీమేక్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాను. వచ్చే ఏప్రిల్‌లో ఈ ప్రాజెక్ట్ మొదలవుతుంది" అని ఆయన వెల్లడించారు.
జాకీ చాన్ నటించిన పలు సినిమాలను తమిళనాడులో రవిచంద్రన్ డిస్ట్రిబ్యూట్ చేశారు. ఇప్పుడు 'అన్నియన్' రీమేక్‌లో ఆయనను నటింపజేయాలని ఆయన భావిస్తున్నారు. "చాలా కాలంగా జాకీ చాన్ నాకు తెలుసు. నా సినిమా మ్యూజిక్ రిలీజ్ ఈవెంట్‌కు కూడా ఆయన వచ్చారు" అని ఆయన చెప్పారు.
మరి శంకర్‌పై హిందీ రీమేక్ రైట్స్ విషయమై వేసిన కేసు ఎంతదాకా వచ్చింది? "కాపీరైట్స్ నా దగ్గర వున్నాయి. ఆ మూవీని నేనే నిర్మిస్తున్నాను. నా ఫోకస్ దానిపైనే" అని వివరణ ఇచ్చారు రవిచంద్రన్.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



