డేటింగ్ కి రెడీ అన్న బాలీవుడ్ బ్యూటీలు.. విజయ్ రియాక్షన్
on Jul 13, 2022

టాలీవుడ్ హీరోలలో మరెవరికీ సాధ్యంకాని విధంగా అతి కొద్ది సమయంలోనే బాలీవుడ్ లో క్రేజ్ సంపాదించుకున్నాడు విజయ్ దేవరకొండ. ఇంతవరకు కనీసం ఒక హిందీ సినిమా లేదా పాన్ ఇండియా సినిమా కూడా చేయకుండానే బాలీవుడ్ స్టార్స్ ని సైతం ఫిదా చేశాడు. జాన్వీ కపూర్ లాంటి బాలీవుడ్ బ్యూటీలు ఎందరో విజయ్ తో డేటింగ్ చేయాలనుందని చెప్పారు. తాజాగా ఆ లిస్టులో మరో బ్యూటీ సారా అలీ ఖాన్ చేరింది.
కరణ్ జోహార్ హోస్ట్ గా వ్యవహరించే 'కాఫీ విత్ కరణ్' షోలో జాన్వీ కపూర్, సారా అలీ ఖాన్ కలిసి పాల్గొన్నారు. తాజాగా ఈ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో విడుదలైంది. ఇందులో ఎవరితో డేట్ కి వెళ్లాలనుంది అని కరణ్ అడగగా.. ''విజయ్ దేవరకొండతో డేటింగ్ చేయాలనుంది" అని సారా చెప్పింది. దీంతో వెంటనే జాన్వీ వైపు చూస్తూ కరణ్ "నువ్వు విజయ్ తో డేటింగ్ కి వెళ్తానన్నావు కదా" అనడంతో.. "నీకు విజయ్ అంటే ఇష్టమా" అంటూ జాన్వీని సారా అడిగింది. ఇలా ముగ్గురి మధ్య సరదాగా సాగింది సంభాషణ. ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

మరోవైపు తనతో డేటింగ్ చేయాలనుందని బాలీవుడ్ బ్యూటీలు చెప్పడంపై విజయ్ స్పందించాడు. తన ఇన్ స్టాగ్రామ్ స్టోరీలో ప్రోమోని షేర్ చేసిన విజయ్.. "మీకు నా బిగ్ హగ్, అఫెక్షన్" అని రాసుకొచ్చాడు.
సినిమాల విషయానికొస్తే పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ చేస్తున్న పాన్ ఇండియా మూవీ 'లైగర్' విడుదలకు సిద్ధమవుతోంది. అలాగే ప్రస్తుతం శివ నిర్వాణతో 'ఖుషి' సినిమా చేస్తున్న విజయ్.. పూరి దర్శకత్వంలో మరో పాన్ ఇండియా ఫిల్మ్ 'జనగణమన' చేయనున్నాడు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



