మిలటరీ డ్రామాలో సల్మాన్ ఖాన్.. సికందర్ ప్లాప్ పై జోకులు!
on Jun 18, 2025
.webp)
సుదీర్ఘ కాలం నుంచి తన నటనతో అభిమానులు,ప్రేక్షకులని అలరిస్తు వస్తున్న సల్మాన్ ఖాన్(Salman KHan)తన కెరీర్ లో చూడని విజయం, సృష్టించని రికార్డు లేదు. ఈ ఏడాది మార్చిలో 'సికిందర్' అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. రిలీజ్ కి ముందు అభిమానులతో పాటు ప్రేక్షకుల్లో మంచి అంచనాలని క్రియేట్ చేసిన సికందర్ బాక్స్ ఆఫీస్ వద్ద పరాజయాన్ని చవి చూసింది. మురుగుదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో రష్మిక హీరోయిన్ గా చేసింది.
ఈ సారి ఎలాగైనా హిట్ ని అందుకోవాలని అపూర్వ లఖియా దర్శకత్వంలో ఒక మూవీకి సల్మాన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా వార్తలు వస్తున్నాయి. మిలటరీ డ్రామా నేపథ్యంలో వాస్తవ సంఘటనలని ఈ కథలో చూపించబోతున్నట్టుగా తెలుస్తుంది. అపూర్వ లఖియా నుంచి గతంలో మిషన్ ఇస్తానూబుల్, తుఫాన్, క్రాక్ డౌన్, హసీనా పర్కర్ వంటి పలు విభిన్న చిత్రాలు వచ్చాయి. దీంతో ఈ ఇద్దరి కాంబో పై అందరిలో ఆసక్తి నెలకొని ఉంది. సల్మాన్ సరసన' చిత్రామ్ గధ హీరోయిన్ గా చేస్తుండగా, ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'హౌస్ ఫుల్ 5 'తో చిత్రామ్ గధ మంచి విజయాన్ని అందుకుంది. ఆమె సల్మాన్ తో తొలిసారిగా స్క్రీన్ షేర్ చేసుకుంటుంది.
ఇక సల్మాన్ ఈ శనివారం నెట్ ఫ్లిక్స్ వేదికగా టెలికాస్ట్ కానున్న 'ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో సీజన్ 2 ' మొదటి ఎపిసోడ్ కి గెస్ట్ గా రానున్నాడు. ఈ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో రిలీజ్ అయ్యింది. అందులో సికందర్ ప్లాప్ గురించి సల్మాన్ చెప్పిన మాటలు నవ్వులని పూయిస్తున్నాయి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



