పాము కాటుకు గురైన బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్
on Dec 26, 2021

బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ పాము కాటుకు గురయ్యాడు. మహారాష్ట్రలోని పన్వేల్ ఫామ్ హౌస్ లో ఈరోజు తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకుంది. దీంతో చికిత్స నిమిత్తం కమోతేలోని ఎంజీఎం ఆస్పత్రికి ఆయనను తరలించారు.
వీకెండ్ విడిది కోసం సల్మాన్ శనివారం ఫామ్ హౌస్‌కి వెళ్లాడు. అయితే అర్థరాత్రి దాటాక మూడు గంటల సమయంలో ఆయనను పాము కాటేసింది. దీంతో సల్మాన్ వ్యక్తిగత సిబ్బంది హుటాహుటిన ఆయనను ఆస్పత్రికి తరలించారు. అయితే సల్మాన్ ని విషం లేని పాము కాటేసిందని, దాని వల్ల ఎలాంటి ప్రమాదం లేదని వైద్యులు తెలిపారు. చికిత్స అనంతరం ఈ రోజు ఉదయం 9 గంటలకు సల్మాన్ ఆసుపత్రి నుండి డిశ్చార్జి అయ్యాడు. తమ అభిమాన నటుడు పాము కాటు నుంచి క్షేమంగా బయట పడడంతో సల్మాన్ ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకుంటున్నారు.
కాగా సల్మాన్ హోస్ట్ చేస్తున్న ‘బిగ్ బాస్ 15’ ఈరోజు(ఆదివారం) రాత్రి ప్రసారం కానుంది. ఈ ఎపిసోడ్ లో 'ఆర్ఆర్ఆర్' టీమ్ సందడి చేయనుంది. అంతేకాకుండా సల్మాన్ పుట్టినరోజు డిసెంబర్ 27న కావడంతో ‘బిగ్ బాస్’ వేదికపైనే ‘ఆర్ఆర్ఆర్’టీంతో కలిసి బర్త్ డే సెలెబ్రేట్ చేసుకున్నాడు సల్మాన్.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



