నమ్మక తప్పని నిజమైనా అంటూ హ్యాపీగా పాడుతున్న క్రష్మిక!
on Oct 3, 2022

నేషనల్ క్రష్ రష్మిక ఆనందానికి ఇప్పుడు అవధుల్లేవు. నమ్మక తప్పని నిజమైనా, అసలు ఈ పూట ఇక్కడున్నది నేనేనా అంటూ సరదాగా పాటలు పాడుకుంటుంది. ఆమె నటించిన 'గుడ్ బై' సినిమా ఈ నెల 7న విడుదల కానుంది. రష్మిక నటించిన తొలి బాలీవుడ్ సినిమా అదే. ఈ సినిమా ప్రమోషన్లలో ఇండియన్ మూవీ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్‌తో కలిసి పాల్గొంటోంది రష్మిక.
"ఆయన సినిమాలు చూస్తూ పెరిగాను. అలాంటిది ఆయనతో నేను సినిమాకు సంతకం చేయడమేంటి? ఆయనతో సెట్లో నటించడమేంటి? ఆయనతో మాట్లాడటమేంటి? ఇలా ఒకే స్టేజ్ పంచుకోవడమేంటి? ఇద్దరం ఒకే టాపిక్ గురించి మాట్లాడటమేంటి? సొంత బిడ్డలా ఆయన నాతో ఆప్యాయంగా ఉండటమేంటి? అసలు ఊహకే అందడం లేదు. నిజమేనా అనే అనుమానం ఇప్పటికీ కలుగుతోంది. కానీ ఎక్కడో నమ్మాలనిపిస్తోంది. ఆనందంగా ఉండాలనిపిస్తోంది" అంటూ సోషల్ మీడియాలో రాసుకొచ్చింది రష్మిక.

పుష్పతో తనకు నార్త్ లో మంచి క్రేజ్ వచ్చిందని, తగిన గుర్తింపు దక్కిందని చెప్పుకుంటున్న రష్మిక, త్వరలోనే తనకు గుడ్‌బై అంతకు మించిన పేరు తెచ్చిపెడుతుందనే నమ్మకంతో ఉంది. బాలీవుడ్‌లో యంగ్‌స్టర్స్ తో వరుసగా సినిమాలకు సంతకం చేస్తోంది రష్మిక.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



