బిగ్ బాస్ ఎఫెక్ట్.. భర్తతో విడాకులు ప్రకటించిన రాఖీ సావంత్!
on Feb 14, 2022

ఇటీవల సినీ సెలబ్రిటీల విడాకుల వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. తాజాగా ఆ లిస్ట్ లో బాలీవుడ్ నటి రాఖీ సావంత్ కూడా చేరిపోయింది. తన భర్త రితేష్ సింగ్ నుంచి విడిపోతున్నట్లు ఆదివారం సాయంత్రం ఆమె ప్రకటించింది.
మోడల్ గా, నటిగా, డాన్సర్ గా, హోస్ట్ గా ప్రేక్షకులను అలరించిన రాఖీ సావంత్ విడాకుల ప్రకటనతో తాజాగా వార్తల్లో నిలిచింది. ఆమె హిందీ బిగ్ బాస్ మొదటి సీజన్ లో కంటెస్టెంట్ గా పాల్గొనడమే కాకుండా.. బిగ్ బాస్ 14, 15 సీజన్స్ లో సందడి చేసింది. అయితే ఇప్పుడు ఆ బిగ్ బాస్ షోనే వారి విడాకులకు కారణమైందని తెలుస్తోంది.
"రితేష్, నేను విడిపోయి మా దారులు మేం చూసుకోవాలి అనుకుంటున్నాం. బిగ్ బాస్ తర్వాత మా మధ్య తలెత్తిన విభేదాలు చేజరిపోయాయి. విభేదాలు తొలగించుకునేందుకు ఎంతో ప్రయత్నించాం. కానీ సాధ్యం కాలేదు. అందుకే విడిపోవాలని నిర్ణయం తీసుకున్నాం. వాలెంటైన్స్ డే సమయంలో ఇలా జరగడం బాధగా ఉంది. రితేష్ కి తన జీవితంలో మంచి జరగాలని కోరుకుంటున్నా. ఇకపై నా దృష్టంతా నా లైఫ్, నా కెరీర్ పై పెట్టి హ్యాపీగా జీవించాలి అనుకుంటున్నాను" అని రాఖీ సావంత్ తెలిపింది. ఈ మేరకు ఆమె ఒక నోట్ విడుదల చేసింది.

ఇదిలా ఉంటే, తెలుగు బిగ్ బాస్ 5 లో పాల్గొన్న షణ్ముఖ్ జస్వంత్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత తన ప్రేయసి దీప్తి సునైనాతో విడిపోయిన సంగతి తెలిసిందే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



