జాక్వలిన్ ఫస్ట్ స్టెప్ వేసేశారు!
on Mar 29, 2023
తెలుగువారికి ఆమె బ్యాడ్ గర్ల్ గా తెలుసు. ఆమెను ఇష్టపడేవారు బొమ్మ అని ముద్దుగా పిలుచుకుంటారు. ఇంతకీ ఆమె ఎవరో గుర్తుపట్టేశారుగా. ఆమె పేరు జాక్వలిన్ ఫెర్నాండజ్. ఇప్పుడు బాలీవుడ్‌లో ఆమె పేరు ఓ సెన్సేషన్. లేటెస్ట్ గా ఫతేః మూవీలో నటిస్తున్నారు జాక్వలిన్. ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ ఇటీవల అమృత్‌సర్‌లో జరిగింది. జాక్వలిన్ మాట్లాడుతూ ``థాంక్యూ అమృత్‌సర్`` అని తనను అంత గొప్పగా రిజీవ్ చేసుకున్నందుకు, మంచి అనుభూతికలిగించినందుకు కృతజ్ఞతలు చెప్పారు. ఇటీవల లాస్ ఏంజెల్స్ లో ఫిల్మ్, ఫ్యాషన్, ఆర్ట్ విభాగంలో ఆమె విమెన్ ఆఫ్ ఎక్సలెన్స్ అవార్డు అందుకున్నారు.
ఆ మధ్య ఆస్కార్ వేడుకల్లోనూ పాల్గొన్నారు. అక్కడి నుంచి తిరిగి వచ్చాక ఆమె అమృత్‌సర్‌లో షూటింగ్‌లో పాల్గొన్నారు. ఆ సిటీలో ఉండటం చాలా ఆనందంగా అనిపించిందని చెప్పారు. ఆమె అమృత్‌సర్‌లో ఉండగానే, అక్కడి లోకల్ ఫ్యాన్ ఆమెకు స్కెచ్ వేసి ప్రెజెంట్ చేశారు. మరో ఫ్యాన్ లస్సీ అందించారు. డెలీషియస్ పంజాబీ ఫుడ్‌ని ఆస్వాదించినట్టు జాక్వలిన్ స్వయంగా పోస్టులు పెట్టారు. అంతే కాదు, అమృత్‌సర్‌లో ఆమె ఉన్నన్నాళ్లూ రకరకాల ప్రదేశాలను సందర్శించారు. పిక్స్ పోస్ట్ చేశారు. ఫస్ట్ షెడ్యూల్ పూర్తయినప్పటికీ, ఆ జ్ఞాపకాలను ఆస్వాదించారు జాక్వలిన్. థాంక్యూ అమృత్‌సర్ అంటూ రెడ్ హార్ట్ ఎమోజీస్‌తో థాంక్యూ చెప్పారు. ఈ సినిమాలో సోనూసూద్ యాక్ట్ చేస్తున్నారు. జీ స్టూడియోస్ నిర్మిస్తోంది. అన్నట్టు, సోనూసూద్‌తో కలిసి గోల్డెన్ టెంపుల్‌ని కూడా విజిట్ చేశారు జాక్వలిన్. ఆమెకు ప్రస్తుతం చేస్తున్న ఈ మూవీతో పాటు విద్యుత్ జమ్వాల్, అర్జున్ రాంపాల్ సినిమాలు కూడా లైనప్‌లో ఉన్నాయి.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
