వంద మంది ఆసుపత్రి పాలు.. ఆగిపోయిన మూవీ షూటింగ్!
on Aug 19, 2025

వందల మందితో ముడిపడిన సినిమా షూటింగ్ లలో చిన్న చిన్న ప్రమాదాలు జరిగి ఒకరిద్దరు ఆసుపత్రి పాలవ్వడం చూస్తుంటాం. అయితే ఒకేసారి వంద మంది ఆసుపత్రి పాలైన ఘటన తాజాగా చోటు చేసుకుంది. దాంతో మూవీ షూటింగ్ ఆపేయాల్సి వచ్చింది.
బాలీవుడ్ హీరో రణ్‌వీర్ సింగ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'ధురంధర్'(Dhurandhar). జమ్మూ కాశ్మీర్ లోని లేహ్ లో ఈ మూవీ షూటింగ్ జరుగుతోంది. అయితే ఈ షూటింగ్ లో ప్రొడక్షన్ ఫుడ్ తిని వంద మందికి పైగా ఆసుపత్రి పాలయ్యారు.
'ధురంధర్' షూటింగ్ లో మొత్తం 600 మంది పాల్గొనగా.. ఫుడ్ తిని 120 మంది తీవ్ర అస్వస్థకు గురైనట్లు తెలుస్తోంది. వెంటనే వారిని హాస్పిటల్ కి తరలించగా.. ఫుడ్ పాయిజనింగే కారణమని వైద్యులు తెలిపారు. మరో 200 మంది దాకా స్వల్ప అస్వస్థకు గురైనట్లు సమాచారం. ఫుడ్ సేఫ్టీ అధికారులు శాంపిల్స్ సేకరించి, ల్యాబ్ కి పంపారు. ప్రస్తుతం ఈ ఘటనపై విచారణ జరుగుతోంది.
కాగా, 'ఉరి' ఫేమ్ ఆదిత్య ధర్ దర్శకత్వం వహిస్తున్న 'ధురంధర్'లో సంజయ్ దత్, ఆర్. మాధవన్, అక్షయ్ ఖన్నా, అర్జున్ రాంపాల్, సారా అర్జున్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



