ధురంధర్ ఫస్ట్ డే కలెక్షన్స్.. రికార్డులే తరువాయి
on Dec 6, 2025

-కెరీర్ లోనే ఫస్ట్ టైం
-ప్యూర్ పాజిటివ్ టాక్
-వీకెండ్ కి మరింత భారీ కలెక్షన్స్
బాలీవుడ్ స్టార్ హీరో 'రణవీర్ సింగ్'(Ranaveer Singh)నిన్న 'దురంధర్'(Dhurandhar)అనే కొత్త చిత్రంతో వరల్డ్ వైడ్ గా ఉన్న థియేటర్స్ లో ల్యాండ్ అయ్యాడు. స్పై యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కగా సంజయ్ దత్, మాధవన్, అక్షయ్ కన్నా, అర్జున్ రాంపాల్ వంటి మేటి నటులు కూడా సిల్వర్ స్క్రీన్ షేర్ చేసుకోవడం దురంధర్ స్పెషాలిటీ. సుమారు 130 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కగా ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ తో ముందుకు దూసుకుపోతుంది. మరి ఈ చిత్రం తొలి రోజు సాధించిన కలెక్షన్స్ వివరాలు చూద్దాం.
మొదటి రోజు ఇండియాలో 27 కోట్ల రూపాయలు, ఓవర్ సీస్ లో 13 కోట్ల రూపాయలతో వరల్డ్ వైడ్ గా 40 కోట్ల రూపాయలని సాధించినట్టుగా ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి.రణవీర్ గత చిత్రాల మొదటి రోజు కలెక్షన్స్ తో పోల్చితే హయ్యెస్ట్ కలెక్షన్స్ అని చెప్పవచ్చు. దీంతో తన కెరీర్ లోనే ఫస్ట్ టైం రికార్డు ఓపెనింగ్స్ ని సాధించినట్లయింది. సినీ విశ్లేషకులు కూడా ఈ కలెక్షన్స్ పై స్పందిస్తూ వీకెండ్ లో 'దురంధర్' వంద కోట్ల క్లబ్ లో చేరడం ఖాయమని చెప్తున్నారు.
Also Read: వాళ్లు సర్వనాశనం అయిపోతారంటున్న ఇంద్రజ.. వాళ్ళు వీరే
ఇక 'ఆదిత్య దర్'(Aditya Dhar)స్వీయ దర్శకత్వంలో ధురంధర్ తెరకెక్కగా 2000 వ సంవత్సర ప్రారంభంలో పాకిస్తాన్‌లో జరిగే స్పై థ్రిల్లర్ కధాంశంతో తెరకెక్కింది. లైయారి ముఠాలని నిర్మూలించే భారతీయ గూఢచారిగా రణవీర్ కనిపించాడు. ఇక మూవీ చూసిన అభిమానులు స్పందిస్తు 'జస్కి రత్ సింగ్ రంగి, హంజా అలీ మజారి అనే రెండు భిన్నమైన పార్శ్యాలు కలిగిన క్యారక్టర్ లలో రణవీర్ సింగ్ నటన ఒక రేంజ్ లో ఉందని తన కెరీర్ లోనే బెస్ట్ మూవీగా నిలిచే అవకాశం ఉందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



