హీరోయిన్ గా శ్రీదేవి చిన్నకూతురు.. కన్ఫర్మ్ చేసిన బోనీ కపూర్
on Feb 26, 2022

అతిలోక సుందరి శ్రీదేవి నటిగా ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. ఆమె పెద్ద కూతురు జాన్వీ కపూర్ బాలీవుడ్ లో హీరోయిన్ గా అలరిస్తోంది. ఇప్పుడు ఆమె చిన్న కూతురు ఖుషి కపూర్ సైతం హీరోయిన్ గా అలరించడానికి సిద్ధమైంది.
ప్రముఖ దర్శకురాలు జోయా అఖ్తర్ నెట్ ఫ్లిక్స్ తో ఓ సినిమా తీసేందుకు సిద్ధమయ్యారు. ఈ సినిమాతో అమితాబ్ బచ్చన్ మనవడు అగస్త్య నందా హీరోగా పరిచయం కానున్నాడు. షారూఖ్ ఖాన్ కూతురు సుహానా ఖాన్ హీరోయిన్ గా నటించనుంది. మరో హీరోయిన్ గా ఖుషి కపూర్ నటించనుంది. ఒకే సినిమాతో ముగ్గురు వారసులు ఎంట్రీ ఇస్తుండటం విశేషం.
ఖుషి తండ్రి బోనీ కపూర్ కూడా ఆమె ఎంట్రీని కన్ఫర్మ్ చేశారు. ఖుషి నటించే మొదటి సినిమా షూటింగ్ ఏప్రిల్ లో మొదలవుతుందని, త్వరలోనే మిగతా వివరాలు తెలుస్తాయని అన్నారు. మరి శ్రీదేవి వారసురాలిగా పరిచయమవుతున్న ఖుషి కపూర్ ప్రేక్షకులను ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో చూడాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



