ఏడాది పాటు గదిలో బంధించాడు.. అమీర్ ఖాన్ పై సోదరుడు ఫైజల్ ఖాన్ ఆరోపణ
on Aug 9, 2025

బాలీవుడ్ స్టార్ హీరోల్లో 'అమీర్ ఖాన్'(Aamir Khan)కూడా ఒకరు. నాలుగు దశాబ్దాలపై నుంచి వైవిధ్యమైన చిత్రాల్లో చేస్తు, ఎంతో మంది అభిమానులని సంపాదించాడు. జూన్ 20 న 'సితారే జమీన్ పర్' తో వచ్చి మరోసారి భారీ విజయాన్ని అందుకున్న అమీర్, ఈ నెల 15 న 'కూలీ' ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.
రీసెంట్ గా అమీర్ ఖాన్ సోదరుడు 'పైజల్ ఖాన్'(faissal Khan)మాట్లాడుతు కొన్ని విషయాల్లో నేను నా కుటుంబానికి సహకరించలేదు. దీంతో నేను మానసిక వ్యాధికి గురయ్యానని, పిచ్చివాడినని, సమాజానికి హాని చేస్తానని అన్నారు. ఆ విధంగా నేను ఉచ్చులో కురుకుపోయానని అర్థమైంది. దాన్నుంచి ఎలా బయటపడాలో అర్ధం కాలేదు. 'అమీర్ 'నన్ను ఏడాది పాటు గదిలో బంధించాడు. ఫోన్ లాగేసుకొని గది బయట బాడీ గార్డ్ లని పెట్టారు. నా తండ్రి నన్ను కాపాడతాడని అనుకున్నాను. కానీ నా తండ్రితో ఎలా మాట్లాడాలో అర్ధం కాలేదు. గతంలో మానసిక ఆరోగ్యం మెరుగు కోసం ట్రీట్ మెంట్ తీసుకున్నాను. కొన్ని రోజుల చికిత్స అనంతరం నార్మల్ గా అయ్యాను. అయినా కూడా అమీర్ నన్ను బంధించాడని ఫైజల్ చెప్పుకొచ్చాడు.
మూడేళ్ళ వయసులోనే బాలనటుడిగా సినీ రంగ ప్రవేశం చేసిన ఫైజల్, 1994 లో సోలో హీరోగా 'మధోష్'అనే మూవీతో ఎంట్రీ ఇచ్చాడు. ఆ సినిమా పరాజయం చెందింది. ఆ తర్వాత అమీర్ హీరోగా చేసిన కొన్ని చిత్రాల్లో ప్రధాన పాత్రల్లో నటించాడు. అమీర్, ఫైజల్ తండ్రి పేరు తాహిర్ హుస్సేన్(Tahir Hussain)నిర్మాతగా, నటుడిగా, దర్శకుడిగా, రైటర్ గా భారతీయ చిత్ర పరిశ్రమకి తన సేవలని అందించాడు. 2010 లో చనిపోవడం జరిగింది. ఆస్థి విషయంలో ఫైజల్ గత కొంత కాలంగా 'అమీర్' పై కోర్టు ద్వారా పోరాటం చేస్తున్నాడు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



