అప్పుడు 'ది కాశ్మీర్ ఫైల్స్'.. ఇప్పుడు 'ది వ్యాక్సిన్ వార్'!
on Nov 10, 2022
ఈ ఏడాది 'ది కాశ్మీర్ ఫైల్స్' చిత్రంతో సంచలనం సృష్టించిన దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి, నిర్మాత అభిషేక్ అగర్వాల్ కాంబినేషన్ లో మరో ఆసక్తికరమైన సినిమా రాబోతోంది. ఈ చిత్రానికి 'ది వ్యాక్సిన్ వార్' అనే టైటిల్ ను పెట్టారు.
'ది కాశ్మీర్ ఫైల్స్' సినిమాలో 1990లలో కాశ్మీరీ పండిట్లపై జరిగిన దాడులను కళ్ళకు కట్టినట్టు చూపించి హృదయాన్ని హత్తుకునేలా చేసిన వివేక్ అగ్నిహోత్రి ఈసారి కరోనా వ్యాక్సిన్ కోసం భారత్ చేసిన యుద్ధాన్ని చూపించబోతున్నారు. సైన్స్, ధైర్యం, విలువలతో భారతదేశం పోరాడి గెలిచిన ఒక యుద్ధం యొక్క నమ్మశక్యం కాని నిజమైన కథ అంటూ టైటిల్ తో కూడిన పోస్టర్ ని విడుదల చేసి ఈ చిత్రాన్ని ప్రకటించారు.
టైటిల్ తో పాటు ఈ చిత్ర విడుదల తేదీని కూడా ప్రకటించారు. ఆగస్టు 15, 2023న హిందీ, ఇంగ్లీష్, తెలుగు, తమిళ్ సహా మొత్తం 11 భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
