కత్రినా-విక్కీ పెళ్లి కోసం రాజస్థాన్‌లో బుక్కయిన 45 హోటళ్లు!
on Nov 29, 2021
బాలీవుడ్ లవ్‌బర్డ్స్ కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ డిసెంబర్ 9న రాజస్థాన్‌లో అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకోవడానికి రెడీ అవుతున్నారు. కొన్ని వారాలుగా ఈ వివాహం టాక్ ఆఫ్ ద టౌన్‌గా ఉంటోంది. తమ పెళ్లి గురించి ఈ జంట ఇంతదాకా ఒక్క ముక్క బయటకు చెప్పకపోయినా, ప్రతిరోజూ వారి పెళ్లి గురించి ఏదో ఒక విషయం బయటకు వస్తూనే ఉంది. కాగా ఒక లీడింగ్ డైలీ పేపర్ ప్రకారం రాజస్థాన్‌లో జరగనున్న కత్రినా, విక్కీ పెళ్లి నిమిత్తం ఏకంగా 45 హోటళ్లు బుక్కయ్యాయి!
రాజస్థాన్‌లోని సావై మధోపూర్‌లో ఉన్న సిక్స్ సెన్సెస్ రిసార్ట్‌లో డిసెంబర్ 9న వైభవంగా జరిగే ఈవెంట్‌లో కత్రినా మెడలో మూడు ముళ్లు వేయనున్నాడు విక్కీ. ఈ వేడుకకు హాజరయ్యే అతిథుల కోసం రథంబోర్‌లో 45 హోటల్స్‌ను బుక్ చేసినట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా రిపోర్ట్ చేసింది. "డిసెంబర్ 7 నుంచి పలువురు సినీ సెలబ్రిటీలు ఇక్కడకు రావడం మొదలుపెడతారు. వారిలో షారుక్ ఖాన్ కూడా ఉంటాడని తెలుస్తోంది. డిసెంబర్ 9న సల్మాన్ ఖాన్ కూడా రావచ్చని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. ప్రస్తుతానికైతే ఆయన రాడంటూ చెప్పుకుంటున్నారు. ఈ పెళ్లికి ఎవరు వస్తారో, ఎవరు రారో చూడాల్సి ఉంది" అని సన్నిహిత వర్గాలు తెలిపాయి.
సందర్భవశాత్తూ ఇటీవల విక్కీ-కత్రినా వివాహం వార్తల్ని విక్కీ కజిన్ తోసిపుచ్చాడు. ఇప్పుడు అలాంటి పెళ్లేమీ జరగట్లేదని చెప్పాడు. కానీ ఇటీవల రిపోర్టులు భిన్న కథను చెప్తున్నాయి. డిసెంబర్ 9న విక్కీ, కత్రినా పెళ్లి జరుగుతుందనే వార్త ఇండస్ట్రీలో హల్‌చల్ చేస్తుండగా, దీనిపై ఆ జంట అఫిషియల్ కన్ఫర్మేషన్ కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Also Read