English | Telugu

`ఎన్నెన్నో జ‌న్మ‌ల‌బంధం`: య‌శోధ‌ర్ మాజీ భార్య ట్రాప్‌లో వేద‌

స్టార్ మాలో ప్ర‌సారం అవుతున్న స‌రికొత్త ప్రేమ‌క‌థ `ఎన్నెన్నో జ‌న్మ‌ల‌బంధం`. ప్ర‌ధాన జంట‌గా న‌టించిన య‌శోధ‌ర్‌, వేద ఇద్ద‌రూ తెలుగు ప్రేక్ష‌కుల‌కు కొత్త వారే కావ‌డం.. డైరెక్ట‌ర్ ఎంచుకున్న నేప‌థ్యం.. క‌థాగ‌మ‌నం కొత్త‌గా వుండ‌టంతో ఈ సీరియ‌ల్‌ని బుల్లితెర‌ ప్రేక్ష‌కులు అమితంగా ఇష్ట‌ప‌డుతున్నారు. వేద‌గా డెబ్‌జానీమోడ‌క్‌, య‌శోధ‌ర్‌గా నిరంజ‌న్ కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. ఈ రోజు ఎపిసోడ్ మ‌రింత హైలైట్‌గా నిల‌వ‌బోతోంది.

ఖుషీని కిడ్నాప్ చేసింద‌ని వేద కుటుంబాన్ని పోలీస్టేష‌న్‌కి లాగిన య‌శోధ‌ర్ త‌న మాజీ భార్య ఎంట్రీతో త‌ను త‌ప్పు చేశాన‌ని తెలుసుకుంటాడు. ఎలాగైనా వేద‌కు సారీ చెప్పాల‌నుకుంటాడు. ఇదే విష‌యాన్ని య‌ధ‌ర్ సోద‌రుడు వ‌సంత్ కూడా చెబుతాడు. నీ తొంద‌ర‌పాటు త‌నం వ‌ల్ల వేద జీవితం నాశ‌నం అయ్యేలా వుంద‌ని, అమెకు సారీ చెప్పమంటాడు. ఇందుకు య‌శోధ‌ర్ అంగీక‌రించి వేద‌కు సారీ చెప్ప‌డానికి రెడీ అవుతాడు. టెర్రాస్‌పై వేద వుంద‌ని తెలుసుకుని అక్క‌డికి వెళ్లిన య‌శోధ‌ర్ .. డాక్ట‌ర్ వేద‌కు సారీ చెప్పాడా? ఆ త‌రువాత ఏం జ‌రిగింది అన్న‌ది ఆస‌క్తిని రేకెత్తిస్తోంది.

ఇదిలా వుంటే పాప‌ని అడ్డంపెట్టుకుని వేద‌ని ట్రాప్‌లో ప‌డేస్తుంది య‌శోధ‌ర్ మాజీ భార్య. వేద‌ని కావాల‌ని య‌శోధ‌ర్‌పై రెచ్చ‌గొట్టి అత‌నంటే త‌న‌కు ఇయిష్టం పెరిగేలా ప్లాన్ చేస్తారు. ఇంత‌కీ య‌శోధ‌ర్ మాజీ భార్య ప్లాన్ ఏంటీ? .. త‌న భ‌ర్త‌, బిజినెస్‌మెన్‌, య‌శోధ‌ర్ ప్ర‌త్య‌ర్థితో క‌లిసి ఏం ప్లాన్ చేసింది? .. వేద నిజంగానే వారి ట్రాప్‌లో ప‌డిపోయిందా? అన్న‌ది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.

Brahmamudi : రుద్రాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -922 లో.. ఒకతను వచ్చి రుద్రాణికి మళ్ళీ పసరు మందు ఇస్తాడు. ఆ పసరు మందు పని చేస్తుందా లేదా అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. పని చేస్తుందని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి పసరు మందు తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడే కనకం ఎదురుపడుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి టెన్షన్ పడుతుంది. చేతిలో అదేంటీ అని కనకం అనగానే ఇదా.... నాకే పసరు మందు అజీర్తికి వాడమని చెప్పారని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంత రాత్రివేళ తీసుకొని వెళ్తుంది ఏంటని కనకంకి డౌట్ వస్తుంది.