English | Telugu
'నాగి ఆర్టిస్ట్ కాదు దేవుడు' అంటున్న రాకెట్ రాఘవ
Updated : Jul 8, 2022
ఈవారం జబర్దస్త్ షో ఇలా పూర్తయ్యిందో లేదో.. అలా వచ్చే వారం షో ప్రోమో సోషల్ మీడియాలో రిలీజ్ ఐపోయింది. ఇందులో స్కిట్స్ అన్నీ కూడా మంచి నవ్వు తెప్పించేవిగా పెర్ఫార్మ్ చేసినట్టు కనిపిస్తోంది. ఇది వరకు జబర్దస్త్ కి సుధీర్ టీం బ్యాక్ బోన్ గా ఉండి షోని నడిపేవారు. కానీ ఇప్పుడు ఫ్రంట్ ఫేస్ , బ్యాక్ ఫేస్, అన్ని కూడా చలాకి చంటి టీమ్, రాకెట్ రాఘవ నడిపిస్తున్నారు. ఈ జబర్దస్త్ చరిత్రలో ఏ వారం కూడా బోర్ కొట్టించకుండా, అసభ్యకరమైన పదాలు వాడకుండా చాలా నీట్ గా సాగే రాకెట్ రాఘవ స్కిట్స్ ఇప్పటికీ మంచి మార్కులను సంపాదించుకుంటున్నాయి. ఇక వచ్చే వారం రాఘవ, నాగి టీమ్ చేసిన కేక్ స్కిట్ మాత్రం చాలా నవ్వు తెప్పించేదిలా ఉంది.
ఈ స్కిట్ విషయానికి వస్తే రాఘవ తన వైఫ్ పుట్టినరోజు సందర్భంగా ఒక కూల్ కేక్ తీసుకొచ్చి నాగికి ఇచ్చి తన ఫ్రిజ్ లో పెట్టమని చెప్తాడు. "దానికేం భాగ్యం.. ఇటివ్వండి" అని అడిగి మరీ తీసుకుని ఫ్రిజ్ లో పెడతాడు కేక్ ని. అలా అనేసరికి రాఘవ ఎంతో ఆరాధనగా నాగీని చూస్తూ "మీరు దేవుడు సర్" అంటాడు. "మరి వాళ్ళు ఆర్టిస్ట్ అంటున్నారేంటి" అంటాడు అనుమానంగా నాగి. "ఎవరు సర్ అలా అన్నది.. మీరు ఆర్టిస్ట్.. కానీ కాదు" అంటాడు రాఘవ. కంఫ్యూజన్ లో "కరెక్ట్ నేను ఆర్టిస్ట్ ని కాదు" అంటూ బుర్ర గోక్కుంటూ వెళ్ళిపోతాడు నాగి. ఇక కేక్ ని ఫ్రిజ్ లో పెడ్తాడు నాగి. తర్వాత నుంచి అదే పనిగా రాఘవ.. నాగి ఇంటి తలుపు కొట్టి "సర్ కేక్ ప్యాకెట్ తిప్పి పెట్టారా, తిప్పకుండా పెట్టారా?" అని అడుగుతాడు.
"మళ్ళీ వచ్చి మీరు భోజనం చేశారా?" అని నాగీని అడుగుతాడు రాఘవ. చేశానంటాడు. "హమ్మయ్య.. ఐతే నా కేక్ సేఫె" అంటాడు రాఘవ. మళ్ళీ తలుపు కొట్టి "ఇంతకు కేక్ ఫ్రిజ్ లో పెట్టాం కానీ ప్లగ్ పెట్టారా లేదా?" అని అనుమానంగా అడుగుతాడు. నాగీకి ఒళ్ళు మండిపోతుంది. ఇలాంటి ట్విస్టెడ్ అండ్ కామెడీ స్కిట్స్ వచ్చే వారం మనందరినీ అలరించబోతున్నాయి.