English | Telugu
అభిమన్యు చేతిలో యశ్ ఓటమికి వేద కారణమా ?
Updated : Jun 1, 2022
బుల్లితెరపై ప్రసారం అవుతున్న సీరియల్ `ఎన్నెన్నో జన్మల బంధం`. రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా సాగుతున్న ఈ సీరియల్ అన్ని వర్గాల ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. రేటింగ్ పరంగానూ మంచి ప్లేస్ లో కొనసాగుతోంది. ఏడేళ్ల క్రితం స్టార్ ప్లస్ లో ప్రసారం అయి సూపర్ హిట్ అనిపించుకున్న `యే హై మొహబ్బతే` సీరియల్ ఆధారంగా తెలుగులో ఈ సీరియల్ ని రీమేక్ చేశారు. కన్నడ నటీనటులు ప్రధాన పాత్రల్లో నటించారు. నిరంజన్, కోల్ కతా నటి డెబ్జాని మోడక్ ప్రధాన జంటగా నటించారు. ఇతర కీలక పాత్రల్లో బెంగళూరు పద్మ, బేబి మిన్ను నైనిక, జీడిగుంట శ్రీధర్, ప్రణయ్ హనుమండ్ల, ఆనంద్ తదితనులు నటించారు.
బుధవారం ఎపిసోడ్ మరింత కీలక టర్న్ తీసుకోబోతోంది. కోట్లు విలువ చేసే ప్రాపర్టీ వేలానికి వస్తుంది. అయితే ఆ వేలం పాటకు వెళ్లడానికి, అందులో పాట పాడటానికి యష్ ఇబ్బందిపడుతుంటాడు. గొంతు ఇన్ ఫెక్షన్ కారణంగా యష్ బాధపడుతుంటాడు. అయితే తనతో కలిపి వేలం పాటకు వెళ్లడానికి ఎవరు వెళ్లాలనేది సమస్యగా మారుతుంది. వసంత్ ని తీసుకెళ్లాలంటే తనకు ఆఫీస్ లో ప్రత్యేక మీటింగ్ వుందంటాడు యష్. అయితే డాక్టర్ ని పిలిస్తే సమస్య తీరుతుందని యష్ తండ్రి చెబుతాడు. వెంటనే వసంత్ ఓ డాక్టర్ ని పిలిచి యష్ పరిస్థితిని వివరిస్తాడు.
అయితే తనకు గొంతు ఇన్ ఫెక్షన్ బాగా వుందని, మూడు రోజుల నుంచి వారం పాటు తను రెస్ట్ తీసుకోవాలని షాకిస్తాడు. ఇప్పడు ఎలా? వేలం పాటకు వెళ్లాలి అని యష్ ఫీలవుతుంటాడు. ఈలోగా వేద వుందిగా తనని తీసుకెళ్లు. నువ్వు పేపర్ పై రాసింది వేద అక్కడ చెబుతుంది ప్రాబ్లమ్ సాల్వ్ అని మాలిని చెబుతుంది. అయిష్టంగానే వేదని యష్ వేలం పాటకి తీసుకెళతాడు. అక్కడికి అభిమన్యు, మాళవిక కూడా వచ్చి యష్ తో పోటీపడతారు. అయితే చివర్లో 60 కోట్లకు మించి పాట పాడమనడంతో వేద ఇంత పెట్టి కొనడం అవసరమా? అని యష్ చెప్పింది వినదు.
దీంతో వేలం పాటలో కోట్ల ప్రాపర్టీ అభిమన్యు సొంతం అవుతుంది. దాన్ని ఆదిత్యకు గిఫ్ట్ గా ఇస్తానంటాడు అభిమన్యు. వేలం పాటలో ఓడిపోవడంతో యష్ ఫీలవుతుంటాడు. అది గమనించి నీ భార్యే నిన్ను నా చేతిలో ఓటమి పాలయ్యేలా చేసిందని అభిమన్యు అంటాడు. దీంతో యష్ - వేదల మధ్య మళ్లీ దూరం మొదలవుతుంది. ఆ తరువాత ఏం జరిగింది? అన్నది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.